Wednesday, April 24, 2024

అత్యవసర సేవల కోసం వైద్యులకు ప్రత్యేక వీసా పథకం : మోడీ సూచన

- Advertisement -
- Advertisement -

Special visa scheme for doctors for emergency services

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని తుద ముట్టించడానికి టీకా అభివృద్ధిలో దేశాల మధ్య పరస్పర సహకార స్ఫూర్తి ఎంతో కీలకమని, దీనివల్ల ఎలాంటి కష్టమైనా అధిగమించగలమని ప్రధాని నరేంద్రమోడీ ఆయా దేశాధినేతలను కోరారు. గురువారం కొవి డ్ 19 మేనేజ్‌మెంట్‌పై 10 దేశాలకు చెందిన వైద్యాధికారులు, నిపుణులతో జరిగిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశం జరిగింది. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే ప్రయాణించడానికి వీసా నిబంధనలు అడ్డుకాకూడదని అలాంటి ఆటంకాలు లేకుండా వీలుగా వైద్యులు, నర్సులు ఎక్కడికైనా ప్రయాణించే విధంగా ప్రత్యేక వీసా పథకాన్ని తీసుకురావాలని ప్రధాని సూచించారు. ఈ పథ కం అమలైతే అత్యవసర సమయాల్లో ఆయా దేశాల మధ్య వారు త్వరగా ప్రయాణించ గలుగుతారని సూచించారు. అలాగే పొరు గు పౌర విమానయాన మంత్రిత్వశాఖలు వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా ప్రాంతీయ ఎయిర్ అంబులెన్స్ ఒప్పందాన్ని సమన్వయం చేయవచ్చని పేర్కొన్నారు.

Special visa scheme for doctors for emergency services

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News