Saturday, March 25, 2023

మేడారం బస్సును ప్రారంభించిన స్పీకర్

- Advertisement -

bus

మన తెలంగాణ/చిట్యాల : మేడారం సమ్మక్కసారలమ్మ జాతరకు ప్రత్యేకంగా ప్రజల రవాణా  సౌకర్యం కోసం మంగళవారం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆర్‌టిసి బస్సును  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధితో పాటు రవాణాసౌకర్యం కోసం రోడ్లను వేయించడం జరిగిందన్నారు. దీంతో సులభంగా ప్రజలు ప్రయాణించడం జరుగుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేస్తుందని ఆయన తెలిపారు. తల్లుల దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మేడారం నుండి నేరుగా చిట్యాల వరకు సౌకర్యం కల్పించమని అన్నారు. మేడారం జాతరకు వేళ్లె ప్రజలు ఆర్‌టిసి బస్సులను  సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కుంభం రవీందర్ రెడ్డి, నాపాక గుడి చైర్మన్ ఎరుకోండ గణపతి, సర్పంచ్ పుల్లూరి రమాదేవి సతీష్, టౌన్ అధ్యక్షులు పిట్టల సుధాకర్, యంపిటిసి గుర్రం సునీతతిరుపతి, టిఆర్‌ఎస్ నాయకులు  రవీందర్ రావు, కోడెల రాయమల్లు ,పిట్టల రాజమొగిలి, దొడ్డి శంకర్, జాలిగపు కిష్టయ్య, ఉప్పుల కిరన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News