Home జాతీయ వార్తలు సోనియా … రాహుల్‌… ప్రియాంకకు ఎస్ పిజి భద్రత తొలగింపు

సోనియా … రాహుల్‌… ప్రియాంకకు ఎస్ పిజి భద్రత తొలగింపు

SPG Securityఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, వయనాడ్‌ ఎంపి రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి ప్రియాంక వాద్రాకు ఎస్ పిజి (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) భద్రతను తొలిగించారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. సోనియా, రాహుల్‌, ప్రియాంకకు ఇక నుంచి జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ ముగ్గురి సెక్యూరిటీపై ఇటీవల భద్రతా సమీక్ష సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే వారికి  ఎస్ పిజి భద్రత తొలగించారు. వీరి జడ్ ప్లస్ భద్రతను సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సిఆర్ పిఎఫ్) పర్యవేక్షించనుంది. ఆగస్టులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా ఎస్ పిజి భద్రతను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మన్మోహన్ కు జడ్ ప్లస్ భద్రత కలిపించారు.

SPG Security Removal To Sonia … Rahul … Priyanka