Saturday, April 20, 2024

ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన నిచ్చెన..

- Advertisement -
- Advertisement -

ముంబయి: బలమైన ఈదురు గాలులకు స్పైస్ జెట్ నిచ్చెన ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఢీకొట్టింది. ఈ ఘటన ఛత్రపతి శివాజి మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.శనివారం ఉదయం ముంబయిలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో విమానాశ్రయంలో స్పైస్ జెట్ నిచ్చెన ఈదురుగాలులకు ఉన్న ప్రాంతం నుంచి వెనక్కి నెట్టుకురావడంతో ఆగివున్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం రెక్కతోపాటు ఇంజిన్‌ను కప్పివుంచే భాగం స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు.

SpiceJet ladder crashes into Indigo craft at Mumbai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News