Home తాజా వార్తలు అక్షర శ్రీకారానికి నిలయం బాసర క్షేత్రం

అక్షర శ్రీకారానికి నిలయం బాసర క్షేత్రం

 Basra

 

ఆధ్యాత్మిక కేంద్రం బాసర క్షేత్రం
పుణ్య నది గోదావరి పరివాహక ప్రాంతం
నిత్యం వేలాది సంఖ్యలో భక్తుల పూజలు
చిన్నారుల అక్షర శ్రీకారాలు
ఆహ్లాదకరమైన వాతవరణంలో ఆలయ క్షేత్రం

బాసర : తెలంగాణ ఆధ్యాత్మిక చిత్రపటంలో విశిష్టస్థానం సంపాందించుకున్న ఆలయం బాసర ఆలయ క్షేత్రం, భగవన్ వేదవ్యాసుని తాపోభూమి తమ సంతానం, విజ్ఞాన విచికలుగా మారాలని ఆకాంక్షిస్తూ, అమ్మ చెంత అక్షర పూజలకు తరలివచ్చే భక్తుల జనవాళి మొక్కులతో పులకరించే పుణ్యభూమి బాసర. నిత్యం అమ్మవారి దర్శనానికి తపిస్తూ ఈ ఆధ్యాత్మిక అరణ్యాన్ని సందర్శించే భక్తులు తమ చిన్నారులకు అక్షర పూజలను చేయిస్తే అష్టైశ్వర్యాలతో ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. సాక్ష్యాత్తు వేద మహర్షి మహాభారత యుగం నాటి బాసర క్షేత్రంలోని గోదావరి నదీతీరాన నిత్యం పుణ్యస్నానాలు ఆచరించి మూడు ముష్టులు ఇసుక తీసుకవచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి సాక్షాత్తు చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీ బాసర క్షేత్రంగా విరాజిల్లడంతో ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నారు.

సరస్వతీ అమ్మవారితోపాటు మహంకాళి, లక్ష్మీదేవి అమ్మవార్లను నిత్యం వేకువజామున అభిషేకం, అలంకరణ చేపట్టి ఏడు గంటలకు మహా మంగళహరతినిచ్చి భక్తులకు సర్వదర్శనం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతి శుక్రవారం నెమలి వాహనంలో అమ్మవారికి పల్లకి సేవను చేపడుతారు. భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం, ఆలయ తరుణ ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాకుండా కొందరు భక్తులు అనుష్టానం తీసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పోందుటకై ఆలయంలో జపం చేస్తూ తెల్లటి చొక్కలను ధరించి అనుష్టనం చేయడానికి గ్రామంలోని పూజారుల ఇంటి వద్దకు వెళ్లి కావలసిన పలహారాన్ని దక్షతగా తీసుకొని ఒకపూట భోజనం చేస్తారు. ఇక్కడ గతంలో మాజీ ప్రధాన మంత్రి దివంగత పీవీ నర్సింగ్ రావు తొమ్మిది రోజుల పాటు అనుష్టానం తీసుకున్నారు.

గోదావరి విశిష్టత…
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం, బ్రహ్మగిరి మహాపర్వతంలో పుట్టి త్రయంబకేశ్వరం పాదాలను తడుపుతూ ఆకాశాన్ని తాకుతూ బ్రహ్మగిరి నుండి నేలకు దూకుతూ చిన్న సెలఏరుగా నాసిక్‌కు చేరుకొని నాసిక్ నుండి పారుతూ ఆధ్యాత్మిక నగరమైన నాసిక్ నగరాన్ని పుణితం చేసి షిర్డీ సాయి బాబా సన్నిధికి అమడ దూరం నుండి ఔరంగబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది. పర్వత ప్రాంతాల్లో ఆరంభమైన పైతాన్‌లో గైక్వాడ్ ప్రాంతం వద్ద ఔరంగబాద్, జలనా, పరబాని జిల్లాలో ప్రవేశించి నాందేడ్ జిల్లాలోని ప్రవేశించి సిక్కుకు ఆరాధ్య దైవమైన పవిత్ర క్షేత్రమైన గురుద్వార్ ఒడ్డుకు చోటు ఇచ్చి వాటితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రవేశించి స్కందుడు నడయడిన కందకుర్తి వద్ద మంజీర, హరిద్ర నదులను కలుపుకొని త్రీవేణి సంఘంగా మరి వ్యాసపూరివైపు పరుగెత్తుతూ వ్యాసుడు మెచ్చిన తపోభూమి బాసరలోని సరస్వతీ సన్నిధిలో పవనం చేసి భక్తులకు కొంగు బంగారమైన విరజిల్లుతోంది.

12 సంవత్సరాలకు ఒక్కసారి ఉత్సవ శోభగా గోదావరి పుష్కారాల సంబరాలను చేసుకుంటారు. నిత్యం మన దేశం నుండి కాకుండా దేశ విదేశాల నుండి భక్తులు నది తీర పుణ్య క్షేత్రాలకు బాసర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బయల్దేరుతారు. అంతేకాకుండా మరి కొందరు మానవ ఆస్తికళను కలపడానికి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. గోదావరినదిలో ఆహ్లాకరమైన వాతవరణంలో నాటు పడవలు కూడా భక్తులకు సౌకర్యార్ధాలున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా దృష్టా రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ నుండి గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా వర్షకాలంలో గోదావరి నదికి కొత్త నీరు చేరుకోవడంతో నదీపరివాహక ప్రాంతాల ప్రజలు, భక్తులు, గ్రామ ప్రజలు మొదటగా గ్రామ దేవతలకు జలాభిషేకాలను చేస్తారు. తెప్పోత్సవాలతోపాటు అనేక పూజా కార్యక్రమాలను చేపడతారు. గత రెండు సంవత్సరాల నుండి ఆలయం తరుఫుణ అమ్మవార్లకు నిత్యం ఆరుగంటల సమయంలో వేద పండితులు, వేద మంత్రొచ్ఛారణ మధ్య గంగాహారతిని చేపడుతున్నారు. అదే విధంగా వేద పాఠశాల వ్యవస్థాపకులు వేదవిద్యానంద సరస్వతీ స్వామీజీ ఆధ్వర్యంలో ఋషి కన్యాలచే నిత్యం గంగాహారతిని చేపట్టగా భక్తులతో నిత్యం గోదావరమ్మ పులకరిస్తుంది.

అమ్మవారిని కాపాడానిక మక్కజీ పటేల్ …
చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని వేద వ్యాసమహార్షి స్థాపించగా నిత్యం పూజలను అందుకుంటున్న బాసర అమ్మవారిని నిజాం కాలంలో కొందరు దుండగలు ఆలయాన్ని ధ్వంసం చేయగా మక్కాజీ అనే వ్యక్తి మరికొందరి సహాయంతో యుద్దంలో వారితో ఎదుర్కొని ఆలయ పున నిర్మాణానికి తోడ్పడ్డారు. ఇప్పటికీ అమ్మవారి గర్భగుడి పక్కన మక్కాజీ పటేల్ రాతీ విగ్రహం ఉన్నందున గ్రామస్తులతోపాటు భక్తులు వారికి కూడా పూజలను చేస్తుంటారు. కొందరు పూర్వీకులు, అర్చకులు మక్కాజీ పటేల్ విశిష్టత గురించి ఇప్పటికి కోనియాడుతారు.

ఆలయంలో పూజాలు పండుగాలు
బాసర క్షేత్రంలోని వేద వ్యాసమహార్షి ఆలయంతోపాటు గోదావరి నది తీరాన సూర్య శ్వరాలయం, దత్తత్రి ఆలయం, వేద మహార్షిగుహా, మహాంకాళి దేవాలయ ఆలయం ఉన్నప్పటికి నిత్యం 4 గంటలకు అమ్మవార్లకు అభిషేకాలను అలంకరణాలను చేసి మహా మం గళహరతినిచ్చి అనంతరం భక్తులకు సర్వదర్శనంతోపాటు చిన్నారులకు అక్షరపూజలను సైతం నిర్వహిస్తారు. ఆలయంలో ప్రతి సంవత్సరం గురుపౌర్ణమితోపాటు నవరాత్రి, వసంత పంచమి వేడుకలను జరుపుతారు. గురుపౌర్ణమి రోజునమూడు రోజుల పాటు యాగ మండపంలో యజ్ఙం నిర్వహించి అనంతరం పూర్ణహూతితో ముగించి వివిధ ఆలయాలకు చెందిన వేద పండితులకు, కవులు, కళాకారులకు విశిష్ట సేవలందించి వారికి రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ పండిత సన్మాన కార్యక్రమాలను చేపడతారు.

9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించినప్పటికీ మొదటి రోజున అమ్మవారికి అభిషేక, అలంకరణ ఉంటుంది. అనంతరం అమ్మవార్లకు ద శమి రోజు వరకు అలంకరణ అభిషేకాలను ఉంటావు. 9 రోజులపాటు అమ్మవార్లు రోజు ఒక్క రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అదే విధంగా అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం నవరాత్రి ఉత్సవాలురావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. వసంత ( శ్రీపంచమి) అమ్మవారి పుట్టిన రోజుకావడంతో ఒక్క రోజు లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు.

బాసర రావడానికి రవాణ సౌకర్యం…
చదువుల తల్లి బాసర అమ్మవారి క్షేత్రానికి రావడానికి దక్షిణ మధ్య రైల్వేతోపాటు అనేక మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుండి అనేక జిల్లాల నుండి ఆయా డిపోలకు చెందిన బస్సులు బాసరకు వస్తాయి. హైదరబాద్ నుండి బాసర 205 కిలోమీటర్లు ఉండగా,నిజామాబాద్ నుండి 40 కిలోమీటర్లు, నిర్మల్ జిల్లా నుండి 50 కిలోమీటర్లు, మహారాష్ట్రలోని నాందేడ్, 150 కిలోమీటర్ల దూరం బారం ఉంటుంది. ఇక్కడ భక్తుల సౌకర్యర్థం హరితహోటల్‌తోపాటు అనేక ప్రైవేటు హోటల్‌తోపాటు బస చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు లాడ్జీలు సైతం అందుబాటులో ఉన్నాయి.

Spiritual center is the Basra field