మనతెలంగాణ/అడ్డాకుల:క్రీడలు ఎప్పుడు సమైఖ్య తను,సోదరభావాన్ని పెంపొందిస్తాయని రాష్టప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పేర్కొ న్నా రు. గురువారం అడ్డాకుల మండల పరిధిలోని కన్మ నూర్ గ్రామంలో నవభారత యువజనసంఘం ఆ ధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వ హించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.19 సం వత్సరాలుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్స్‌లో ప్రస్తుతం 18 టీంలు పాల్గొంటున్నాయి ఆటగాళ్లను, గ్రామస్తులను ఉద్ధ్దేశించి ఆయన మాట్లాడారు. కొత్త సంవత్సరంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ను అందరు సం తోషంగా నిర్వహించుకోవాలని,గ్రామస్తులు,నిర్వా హకులు ఆటగాళ్లకు మంచి సదుపాయాలు కల్పించి, మం చి ఆతిధ్యం ఇచ్చి కన్మనూర్‌లో నిర్వహించిన ఆటలను ఎ ప్పుడు గుర్తుంచుకునేలా చేయాలన్నారు. గెలుపోటములు సహజమని ఆటగాళ్లు సోదరబావంతో మెలగాలని ఆయన కోరారు.అంతకు ముందు నిర్వహకులు టోర్నమెంట్ విజేతలకు మొదటి బహుమతిగా పదివేల నూటపద హా రు,ద్వితీయబహుమతికి అయిదువేల నూటపదహారు,తృతీయబహుమతికి వెయ్యినూటపద హార్లు ,మ్యాన్‌ఆప్‌దమ్యాచ్‌కు అయిదువందల పదహారు ఇవ్వనున్నట్లు అలాగేటోర్నమెంట్ నిర్వహణకు స్వర్గీయ సింగిరెడ్డి రాంరెడ్డి స్మారకార్థం అతని కుమారుడైన నిరంజన్‌రెడ్డి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వెలుబుచ్చారు.అనంతరం నిరంజన్‌రెడ్డి ఆ టలను టాస్‌వేసి ప్రారంభించారు.తాను కొద్దిసేపు క్రికెట్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో మాజీజడ్‌పిటీసి జగధీశ్,పెద్దమందడి ఎంపీపి దయాకర్,సర్పంచ్ ఈశ్వరమ్మ, బుచ్చన్న,భీంరెడ్డి,రాజవర్ధన్‌రెడ్డి,నర్సింహాయాదవ్,తిరుపతిరెడ్డి,వేణు,ప్రశాంత్,రాఘవేంధర్ తదితరులు పాల్గొన్నారు.