Friday, April 19, 2024

భార్యాభర్తల వివాదం బిడ్డను బాదపెట్టకూడదు: సుప్రీం

- Advertisement -
- Advertisement -

Spousal dispute should not affect child: Supreme court

 

న్యూఢిల్లీ : భార్యాభర్తల మధ్యనున్న వివాదం వారి బిడ్డను బాధపెట్టేలా ఉండకూడదని, ఆర్మీ ఆఫీసర్ దంపతుల వివాదంపై విచారిస్తున్న కేసులో సుప్రీం కోర్టు హితవుల పలికింది. తన 13 ఏళ్ల కుమారుడు మైనార్టీ తీరేవరకు సంరక్షణ బాధ్యత వహించాలని ఆర్మీ ఆఫీసర్‌కు సూచించింది. ఆ ఆఫీసర్ వివాహ బంధం రద్దయిపోతున్న సందర్భంగా జస్టిస్‌లు ఎంఆర్ షా, ఎఎస్ బొప్పనలతో కూడిన ధర్మాసనం ఆ కుమారుని సంరక్షణ కోసం భార్యకు నెలకు రూ.50,000 చెల్లించాలని ఆదేశించింది. అపీలు దారుని భార్య, బాధ్యుడైన భర్త 2011 మే నుంచి కలసి నివసించడం లేదు. అందువల్ల వారు తిరిగి కలుసుకోలేని విఛ్ఛిన్నం ఏర్పడింది. అంతేకాకుండా భర్త మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి అప్పీలు దారుని భార్యపై దిగువ కోర్టుల్లో దాఖలు చేసిన క్రూరత్వం, మరియు విడిచిపెట్టడం అనే అంశాలపై విచారణ సాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

కేసు తాలూకు వాస్తవాలు, పరిస్థితులు పరిగణన లోకి తీసుకుంటే వివాహబందం విచ్ఛిన్నమైనందున రాజ్యాంగం లోని ఆర్టికల్ 142 ప్రకారం ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన తీర్పు ఇప్పుడు అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏదెలాగున్నా అదే సమయంలో భర్త తన కుమారుని సంరక్షణ విషయంలో బాధ్యతల నుంచి తప్పించుకోలేరని, ఆ కుర్రవాడు మైనార్టీ తీరి మేజర్ అయిన వరకు సంరక్షణ బాధ్యత వహించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2019 డిసెంబర్ నుంచి ఈ బాధ్యత వర్తించేలా భర్త తన కుమారుని సంరక్షణ కోసం నెలకు రూ.50 వేలు భార్యకు చెల్లించాలని సుప్రీం స్పష్టం చేసింది. అప్పీలు దారుడైన ఆర్మీ ఆఫీసర్ తన భార్య క్రూరత్వం, విడిచిపెట్టడం తదితర అంశాల ఆధారంగా బార్య నుంచి విడాకులు కోరుతూ 2014 లో జైపూర్ ఫ్యామిలీ కోర్టులో దావా వేశారు. దీనిపై వివాహబంధం రద్దు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News