Home తాజా వార్తలు బీటెక్ చదివి.. ఉద్యోగం వదిలి

బీటెక్ చదివి.. ఉద్యోగం వదిలి

Paddy Crop

 

పెద్దపల్లి : ఇద్దరు విద్యార్థులు హరీష్, శ్రీజలు ఇద్దరు బీటెక్ చదివారు. ఇద్దరు బిటెక్‌లో ట్రిపుల్‌ఈ, ఈసిఈలు చేశారు. హరిష్‌కు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ వారికి వ్యవసాయం మీద మక్కువతో బీటెక్ చదివి ఉద్యోగం వదిలాడు. వ్యవసాయం మీద మక్కువతో రైతుకు పనిభారం తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. అలాగే మందుల పిచికారితో రైతులు నానావస్థలు పడటం చూసి ఏదైన చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాక మందుల పిచికారిలతో ఎంతో మంది రైతులు మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తనకు ఒక ఆలోచన వచ్చింది. ఇదే ఆ డ్రోన్ పరికరం. వివరాల్లోకి వెళితే మండలంలోని నిట్టూరు గ్రామానికి చెందిన హరిష్, శ్రీజలు ఇద్దరు రైతు బిడ్డలు.

తన తండ్రి వ్యవసాయం చేస్తూ పడేకష్టాన్ని చూసి ఆలోచించారు. మందులు పిచికారి తైవాన్ పంపులు, చేతి పంపులతో స్ప్రే చేయడం చూశారు. వారికి కల్గిన ఆలోచన డ్రోన్ వైపు నడిపించింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూడ్రోన్‌ను పోఫీల్ కంపెనీ వారు తయారు చేయగా, నాజా టెక్నాలజీ వారు మార్కెట్ లో విడుదల చేశారు. దీనిని విజయవాడ దగ్గర కంకిపాడు నుండి కొనుగోలు చేశామని తెలిపారు. దీని ఖర్చు 7లక్షలు అయింది. దీనికి 10లీటర్లు వాటర్ ట్యాంకు ఉంటుంది. ఈ డ్రొన్ బ్యాటరీ సహాయంతో నడుస్తుంది. ఒక్కొ బ్యాటరీ తో మందును 30 గుంటల పైరుకు పిచికారి చేయవచ్చు. ఓక్కొ బ్యాటరీ చార్జీంగ్ కు 20 నిమిషాల సమయం పడుతుంది. మా స్వంతం పంటలతో పాటు ఇతరులకు కూడ దీనిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

Sprayed Medicine with Drones to Paddy Crop