Home అంతర్జాతీయ వార్తలు చైనా కోసం గూఢచర్యం

చైనా కోసం గూఢచర్యం

SPYING-1వాషింగ్టన్ : చైనా కోసం గూఢచర్యం చేస్తూ, ఆ దేశానికి సమాచారం అందజేసిన అమెరికా ఎఫ్‌బిఐ ఉద్యోగిని అధికారులు గుర్తించారు. చైనా సంతతికి చెందిన అమెరికా పౌరుడు కున్ షాన్ చున్(46) తన నేరాన్ని అంగీకరించాడు. అమెరికాలో ఉంటూ చైనా కోసం ఏజెంటుగా పని చేస్తున్నాడనే ఆరోపణలపై నేరాభియోగాన్ని మోపారు. మార్చి 16న అరెస్ట్ జరిగే వరకూ కున్ ఎఫ్‌బిఐ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఎఫ్‌బిఐలోని సాంకేతిక విభాగంలో పర్యవేక్షక కేంద్రంలో 1997 నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. విదేశీ పర్యటనలో చైనా అధికారిని కలిసినప్పుడు, ఎఫ్‌బిఐకి సంబంధించిన సమాచారాన్ని అందజేసినట్లు గుర్తించారు. 2013 మార్చిలో కున ఎఫ్‌బిఐ సంస్థాగత ఛార్ట్‌ను డౌన్‌లోడ్ చేసినట్లు తేలింది. 2015 జనవరిలో న్యూయార్క్‌లోని ఎఫ్‌బిఐ క్షేత్ర కార్యాలయంలోని నిషేధిత ప్రాంతంలో ఉంచిన పత్రాల ఫొటోలు కూడా తీసుకున్నట్లు గుర్తించారు. ఇలాంటి వివరాలను అన్నింటిని చైనా అధికారికి చేరవేసినట్లు కున్ అంగీకరించినట్లు సమాచారం.