దుబాయ్: అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఐపిఎల్-2020లో ఆదివారం రెండు మ్యాచ్ లు జరగనుండగా, తొలి మ్యాచ్ లో హైదరాబాద్- కోల్కతా ఆడనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్కతా జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. ప్రసిధ్ కృష్ణ, క్రిస్ గ్రీన్ స్థానంలో కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గుసన్లను తీసుకున్నట్టు కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. సన్ రైజర్స్ జట్టులో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఖలీల్ అహ్మద్ స్థానంలో ఆల్ రౌండర్ బసిల్ థంపీని జట్టులోకి తీసుకున్నారు. షాబాజ్ నదీం స్థానంలో అబ్దుల్ సమద్ జట్టులోకి తీసుకున్నట్టు జట్టు సారధి వార్నర్ వెల్లడించాడు.
SRH have won toss and they will bowl first against KKR
#SRH have won the toss and they will bowl first against #KKR.#SRHvKKR #Dream11IPL pic.twitter.com/zvGyv7oFXs
— IndianPremierLeague (@IPL) October 18, 2020