Home IPL 2019 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

 

మొహాలీ: ఐపిఎల్ 2019 సీజన్‌లో భాగంగా మొహాలీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకుని, హైదరాబ్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ జట్టు రెండు మార్పులు చేసింది.

మురగన్ అశ్విన్, అండ్రూ టైల స్థానంలో అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మన్‌లను జట్టులోకి  ఎంపిక చేసినట్లు అశ్విన్ తెలిపాడు. ఇక గత మ్యాచ్లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి తమ జోరును కొనసాగించాలని భావిస్తుంది. మరోవైపు పంజాబ్ జట్టు కూడా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.

SRH vs KXIP: KXIP won toss and opt bowl