Thursday, July 18, 2024

కాలువలో పడిన కారు: ఇద్దరు జలసమాధి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: కాలువలోకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జలసమాధి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖ పట్నానికి చెందిన పవన్(32), చంద్రమోహన్(45) కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో మేనేజర్లుగా పని చేస్తున్నారు. ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో ఓ సమావేశానికి ఐదుగురు హాజరై తిరుగు ప్రయాణంలో గొట్టాబ్యారేజ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి కాలువలోకి పడిపోయింది. పవన్, చంద్ర మోహన్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా వెంకటగిరి, మహేశ్వరరావు, దుర్గా నాగ ప్రవీణ్ స్వల్పంగా గాయపడ్డారు. కాలువలో తొమ్మిది అడుగుల మేర ప్రవాహం ఉందని పోలీసులు వెల్లడించారు. నీటి ప్రవాహాన్ని నిలిపి కారును కాలువలో నుంచి బయటకు తీశారు. ఎస్‌ఐ గోవిందరావు కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

Sri Kakulam Two Members Dead Car Plunged into Canal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News