Home యాదాద్రి భువనగిరి శ్రీ కృష్ణావతారంలో యాదాద్రి వాసుడు

శ్రీ కృష్ణావతారంలో యాదాద్రి వాసుడు

ydd

హంసవాహన అలంకారంలో దర్శించి తరించిన భక్తులు

మన తెలంగాణ/యాదాద్రి :శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పదకొండు పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు అయిన మంగళవారం స్వామి వారి అలంకార శేవలో ఉదయం శ్రీ కృష్ణావతారంలో రాత్రి హంసవాహన అలంకార శేవలో భక్తులకు దర్శనమిచ్చాడు. బాలాలయంలో ఉదయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా చతుర్వేద పారాయణములు మూలమంత్ర జపములను స్త్రోత్ర పారాయణాలను పారాయణికులు నిర్వహించారు. ఆగమ శాస్త్ర అనుసారం అలంకార ప్రియుడైన శ్రీ నరసింహుడిన శ్రీ కృష్ణ రూపిడిగా అలంకరించి ఆలయంలో మేళతాళల మధ్య వేద మంత్రాలను ఉఛ్ఛరిస్తు ఊరేగించారు. స్వామి వారి అలంకార శేవను ఆస్థాన మండపం వద్ద కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించగా వేద పండితులు అర్చకులు స్వామి వారి సేవ విశిష్ఠతను తెలియచేస్తు లోక రక్షణకై అవతారమైన శ్రీ కృష్ణవతారంలో లక్ష్మినరసింహుని శేవ ఎంతో విశిష్ఠతమైనది అని తెలిపారు. సాయంత్రం ఆలయంలో నిత్య ఆరాధన మూల మంత్ర జపములను పారాయణములను గావించి శ్రీ స్వామి అమ్మవార్లను ఉత్సవ మూర్తులుగా అలంకరించి హంసవాహనుడిగా గావించి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లోకంలోని అజ్ఞానంను తొలగించి జ్ఞానంను ప్రసాదించే తత్వంలోనే భాగమే హంసవాహన శేవ అని పండితులు తెలిపారు. ఈ మహోత్సవాల్లో ఆలయ యజ్ఞచార్యులు సముద్రాల శ్రీనివాసచార్యులు, నల్లంధీగల్ నరసింహచార్యులు, కారంపొడి నరసింహచార్యులు, కాడూరి వెంకటచార్యులు, వేద పండితులు శ్రీనివాసశర్మ, వేణుగోపాలచారి, అర్చకుల బృందం, ఆలయ ఈఓ గీత, చైర్మన్ నరసింహమూర్తి, దేవాలయ సిబ్బం పాల్గొన్నారు.