Tuesday, April 23, 2024

ఆస్ట్రేలియాలో శ్రీలంక క్రికెటర్ ధనుష్క అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కొలంబో: క్రికెటర్ ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై 31ఏళ్ల ధనుష్కను పోలీసులు అరెస్టు చేశారని లంక క్రికెట్ జట్టు అధికారులు ఆదివారం నిర్ధారించారు. టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ధనుష్కగ్రూప్స్‌దశలో గాయపడ్డాడు. గాయంతో సూపర్ 12మ్యాచ్‌ల్లో ఆడలేదు. 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినలెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ ధనుష్క 46టీ20లు ఆడాడు. గత ఏడేళ్లుగా శ్రీలంకకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధనుష్క ఫార్మాట్లలో 299, 1601, 741 పరుగులు సాధించాడు. కాగా బాధిత మహిళ ధనుష్కకు ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా పరిచయమైంది.

వీరు ఈ నెల 2న రోజ్‌బేలోని నివాసంలో కలుసుకున్నారు. ఆ సమయంలో ధనుష్క తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని 29ఏళ్ల బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో శనివారం అర్ధరాత్రి తర్వాత ఒంటిగంటకు సస్సెక్స్ స్ట్రీట్‌లోని హోటల్‌లో ధనుష్కను పోలీసులు అరెస్టుచేసి సిడ్నీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ధనుష్క గుణతిలక లేకుండానే శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను వీడింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలవడంతో శ్రీలంక ప్రపంచకప్ రేసు నుంచి వైదొలిగింది.

Sri Lanka batsman arrested in Australia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News