Home తాజా వార్తలు శ్రీలంక ఘన విజయం

శ్రీలంక ఘన విజయం

Sri Lanka sniff win as west indies

 

గాలే: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక 187 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 10 ఆధిక్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఒక దశలో 18 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను వికెట్ కీపర్ జోషువా, బోనర్ ఆదుకున్నారు. ఇద్దరు అసాధారణ పోరాట పటిమతో లంక గెలుపును ఆలస్యం చేశారు. 52/6 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం చివరి రోజు ఆటను కొనసాగించిన లంకకు బోనర్, జోషువా అండగా నిలిచారు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు లంక బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పూర్తి రక్షణాత్మక ఆటను కనబరిచిన బోనర్, జోషువా టెస్టు క్రికెట్‌లోని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 100 పరుగులు జోడించారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన జోషువా 129 బంతుల్లో ఐదు ఫోర్లతో 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన రాకిమ్ కార్న్‌వల్ 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. వారికన్ (1), గాబ్రియల్ (౦) కూడా విఫలమయ్యారు. దీంతో విండీస్ ఇన్నింగ్స్ 79 ఓవర్లలో 160 పరుగుల వద్ద ముగిసింది. మరోవైపు కీలక ఇన్నిగ్స్ ఆడిన బోనర్ 220 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ ఐదు, లసిత్ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఇక రెండు ఇన్నింగ్స్‌లలో అద్భుత బ్యాటింగ్‌తో లంకను ఆదుకున్న కెప్టెన్ కరుణరత్నెకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

Sri Lanka sniff win as west indies