Saturday, April 20, 2024

నెదర్లాండ్స్ @ ’45 ఆలౌట్’

- Advertisement -
- Advertisement -

 

Sri Lanka Win Over Netherlands

చెలరేగిన లహిరు, హసరంగా, శ్రీలంకకు హ్యాట్రిక్ విజయం

షార్జా: ప్రపంచకప్ అర్హత పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించింది. లంకకు ఇది హ్యాట్రిక్ విజయం కాగా, నెదర్లాండ్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి చవిచూసింది. ఇక శ్రీలంక ఇంతకుముందే సూపర్12కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 10 ఓవర్లలో కేవలం 44 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 7.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో శ్రీలంక గ్రూప్‌ఎలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండు విజయాలతో నమీబియా కూడా ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది. ఐర్లాండ్, నెదర్లాండ్స్ క్వాలిఫయింగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. సునాయాస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఓపెనర్ నిసాంకా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ కుశాల్ పెరీరా ధాటిగా ఆడి లంకకు విజయం సాధించి పెట్టాడు. దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచిన పెరీరా ఆరు ఫోర్లతో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

కుప్పకూలింది..

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ చెత్త బ్యాటింగ్‌తో 44 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక నెదర్లాండ్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రత్యర్థి బౌలర్లు సమష్టిగా రాణించి నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌ను తక్కువ పరుగుకే కుప్పకూల్చారు. ఓపెనర్లు మైబుర్గ్ (5), మాక్స్ డౌడ్ (2)లు జట్టుకు అండగా నిలువలేక పోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన బెన్ కూపర్ (9), బాస్ డి లీడ్ (0), వికెట్ కీపర్ ఎడ్వర్డ్ (8), వండర్‌మర్వ్ (0) ఘోరంగా విఫమయ్యారు. కెప్టెన్ సిలార్ (2), బ్రాండన్ గ్లోవర్ (0), బాన్ మీకెరెన్ (0) కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. ఇక జట్టులో అకర్‌మన్ (11) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోర్ మార్క్‌ను అందుకున్నాడు. మిగతావారు ఘోరంగా విఫలం కావడంతో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 44 పరుగుల వద్దే ముగిసింది. ఇక లంక బౌలర్లలో లహిరు కుమార, హసరంగా మూడేసి వికెట్లు పడగొట్టారు. మహీశ్‌కు రెండు వికెట్లు లభించాయి. లహిరుకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News