Home తాజా వార్తలు భారత్ పై బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

భారత్ పై బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

 

లీడ్స్: ఐసిసి ప్రపంచకప్ లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ కరుణరత్నె టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.

మహ్మద్ షమీ, చాహల్ స్థానాల్లో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లను జట్టులోకి తీసుకున్నారు. కాగా, ఇరుజట్లకు ఈ మ్యాచ్ నామమాత్రమే. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో చిలిచిన టీమిండియా ఇప్పటికే  సెమీస్‌ చేరుకున్న విషయం తెలిసిందే. మరోవైపు టోర్నీ నుంచి వైదొలిగిన లంక టీమిండియాపై విజయం సాధించి ప్రపంచకప్ ను ఘనంగా ముగించాలని భావిస్తోంది.

Sri Lanka won toss and opt bat against India