Thursday, March 28, 2024

శ్రీలంక జలాల్లో భారత మత్స్యకారుల పడవ మునక, పదుల సంఖ్యలో గల్లంతు..?

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన భారత మత్స్యకారుల పడవ మునిగిపోయిందని శ్రీలంక నావీ మంగళవారం వెల్లడించింది. సోమవారం డెల్ఫ్ ద్వీపంలోని వాయువ్య ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మత్స్యకారుల గల్లంతైనట్టు భావిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దురేఖను దాటి 8 నాటికల్ మైళ్లు తమ జలాల్లోకి మత్స్యకారుల పడవ చొచ్చుకువచ్చిందని శ్రీలంక నావీ అధికారులు తెలిపారు. తమ పడవను ఢీకొని అది మునిగిపోయిందని వారు తెలిపారు. ఈ ఘటనలో గల్లంతైన మత్సకారుల కోసం రెస్కూ ఆపరేషన్ చేపట్టామని వారు చెబుతున్నారు. పడవలో 50మందికిపైగా ఉన్నట్టు భావిస్తున్నారు. తమ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులు అరెస్ట్‌కు నిరాకరించారని శ్రీలంక నావీ చెబుతోంది. ఈ ఘటనపై సమాచారమందుకున్న భారత అధికారులు దర్యాప్తు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News