Friday, April 19, 2024

ఎల్‌టిటిఇ మారణకాండపై శ్రీలంక పోలీస్‌ల దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

Sri Lankan police investigate LTTE massacre

 

కొలంబో : రెండువేలకు పైగా భద్రతా దళాలను తాను హతమార్చానని మాజీ ఎల్‌టిటిఇ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ) డిప్యూటీ లీడర్ కరుణా అమ్మన్ ఆరోపిస్తూ చేసిన ప్రకటనపై శ్రీలంక ప్రభుత్వం పోలీస్ దర్యాప్తునకు ఆదేశించింది. సోమవారం ఈ విషయం వెల్లడించింది. తాత్కాలిక పోలీస్ చీఫ్ చందన విక్రమరత్నే ఈమేరకు తక్షణం దర్యాప్తు చేపట్టాలని నేరపరిశోధన విభాగానికి ఆదేశాలు జారీ చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. మూడు దశాబ్దాల పాటు సాగిన ఎల్‌టిటిఇ వేర్పాటు యుద్ధ కాలంలో 2000 మందికి పైగా ప్రభుత్వ దళాలను తాను హత్య చేశానని గత వారం ఒక రాజకీయ పార్టీ ర్యాలీలో అమ్మన్ ప్రకటించారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన వివాదాస్పదమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News