Home అంతర్జాతీయ వార్తలు 29న భారత్‌లో శ్రీలంక అధ్యక్షుని పర్యటన

29న భారత్‌లో శ్రీలంక అధ్యక్షుని పర్యటన

Sri Lankan President

 

కొలంబో : శ్రీలంక నూతన దేశాధ్యక్షునిగా ఎన్నికైన గోటబయ రాజపక్స ప్రధాని మోడీ ఆహ్వానంపై నవంబర్ 29న భారత్‌లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ మంగళవారం వెల్లడించారు. రాజపక్సను కలుసుకున్న తరువాత ఈ ప్రకటన విడుదల చేశారు. నూతన దేశాధ్యక్షుని నాయకత్వంలో భారత్, శ్రీలంక మధ్య సంబంధాలు మరింత పటిష్టమై ఉన్నత స్థాయికి చేరుకుంటాయని ప్రధా ని మోడీ సందేశాన్ని నూతన అధ్యక్షుడు రాజపక్సకు అందించినట్టు జైశంకర్ ట్వీట్ చేశారు. సోమవారం ప్రమాణస్వీకారం చేసిన గోటబయ మంగళవారం పరిపాలనా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం నాడు మోడీ రాజపక్సకు టెలిఫోన్ ద్వారా అభినందనలు తెలియచేశారు. తన మొదటి అధికారిక విదేశీ పర్యటనను భారత్‌లో ప్రారంభించాలని మోడీ కోరారు.

Sri Lankan President’s visit to India on the 29th