Wednesday, April 24, 2024

కష్టపడి సాధించిన విజయంలో సంతృప్తి ఉంటుంది

- Advertisement -
- Advertisement -

శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం అసలేం జరిగింది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగులో సహాయ పాత్రలు ఎక్కువగా వరిస్తున్నాయి. అలాంటి క్యారెక్టర్స్‌కు దూరంగా ఉంటూ సోలో హీరోగా మాత్రమే నటించాలని అనుకొని మంచి అవకాశం కోసం ఎదుచుస్తున్న తరుణంలో ఈ సినిమాలో అవకాశం లభించింది. కష్టపడి సాధించిన విజయంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. అలాంటి సక్సెస్‌ను మాకు అందించిన చిత్రమిది అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News