Home ఆఫ్ బీట్ దక్షిణ తెలంగాణకే తలమానికం శ్రీ సలేశ్వరం క్షేత్రం

దక్షిణ తెలంగాణకే తలమానికం శ్రీ సలేశ్వరం క్షేత్రం

అమరనాథ్ యాత్రను తలపించే నల్లమల అందాలు
పేదల ఊటిగా పేరు గాంచిన అభయారణం
రేపటి నుండి13వరకు శ్రీ సలేశ్వరం ఉత్సవాలు

Saleswaram-Temple

మన్ననూర్ : నల్లమల అభయారణ్యంలో వెలసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య క్షేత్రం దక్షిణ తెలంగాణాకే తలమానికమని చెప్పవచ్చు.దేశంలోని అ మరనాథ్ యాత్రను భక్తులు యాస ప్రయాసాల కోర్చి చేరుకోని తమ మొక్కులను చెల్లిస్తారు. వేసవి కాలం వస్తే చల్లటి ఊటి ప్రదేశాన్ని కోరుకునే మహోన్నత క్షేత్రాన్ని తలపించే విధంగా ఇక్కడి శ్రీ సలేశ్వరం లింగమయ్య క్షేత్రం వర్ధిల్లుతుంది. 1973 లో ఈ అటవీ ప్రాంతాన్ని పుల్లుల రక్షిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.అంత కంటే ముందు నుండే ఈ జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఇక్కడి చెంచు పూజారులు తెలిపారు.

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ద పౌర్ణమి సంధర్భంగా నిర్వహించే బ్రహ్మోత్స వాలు ఈ నెల 9నుండి 13 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.దట్టమైన అటవీ ప్రాంతంలో అటవీ శాఖ రోడ్డుమార్గం ద్వారా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ,రంగారెడ్డి,నాగర్‌కర్నూల్,హైద్రాబాద్ జిల్లాల నుంచి కాకుండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా నుండి భక్తులు భారీగా తరలి వస్తారు. సంవత్సరం పాటు నిర్మూనుష్యంగా ఉండే శ్రీ సలేశ్వరం లింగమయ్య క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మాత్రమే ఎతైనా కొండల మద్య నుండే జాలు వారే జలపాతం క్రింద భక్తులు తనవి తీర పూణ్య స్నానాలు ఆచరించి పాప ముల నుంచి విముక్తి పొందుతారు. ఇక్కడికి చేరుకోవాలంటే లింగాల మండలంలోని అప్పాయిపల్లి, రాంపూర్ పెంట,బల్మూర్ మండలం బిల్లకల్, అమ్రాబాద్ మండలం మన్ననూర్, పర్హాబాద్ మీదుగా కాలి నడకన చేరుకుంటారు.

రాత్రి, పగలు ఆడ, మగ, పిల్లలు,వృద్దులు అనే తేడా లేకుండ భక్తులు భారీగా తరలి వస్తారు. కొండచరియలు, చెట్ల ఏర్ల నుంచి జాలువారే నీటి తుంపరలజలపాతం క్రింద కాలు జారితే కొడ లోయలోకి జారిపడే ప్రదేశంగా మీదుగా నడక సాగుతుంది. ఎర్రటి ఎండ లో చల్లటి వెన్నెలలో పక్షులు కిలకిలా రాగాలు, వన్య ప్రాణులు, జంతువుల అరుపులు చెట్ల పొదలు కొండ చరియల మాటున ఉండే కాలి బాట ప్రకృతి రమణియా అందాల సుందర దృశ్యాల మద్య వస్తున్నాం, పోయొస్తాం లింగ మయ్యొ అంటూ భక్తుల అర్థ నాదాలు మద్య చల్లటి అడవి తల్లి పులకించి పోయేందుకు కేరింతలు కొడుతూ ఒక్కరి నొకరు తోసుకుంటూ దారి పొడువున వేలాది మంది భక్తులు పరుగెడుతున్న తీరు చూసి అలపు సొలుపు మాయమవుతాయి. రోజుకు కిలో మీటర్ నడవలేని వారు సైతం సుమారు 30కిలో మీటర్ల కాలి నడకన నడిచి ఈ క్షేత్రాన్ని చేరుకుంటారు.

తెలంగాణ స్వరాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రాన్ని చేరుకొని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఇటివల జిల్లా కలెక్టర్ శ్రీధర్ పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి పూట ఎలాంటి ఇబ్బంది కలుగకుండ విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేశారు. ఎర్రటి ఎండలకు ఇబ్బంది లేకుండ భక్తులు సేద తీరేందుకు గూడారాలు నీటి వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు.

రోడ్డు మార్గం ద్వార వచ్చే భక్తులకు గుర్జీగుండాల వరకు, పర్హాబాద్ మీదుగా రాంపూర్ పెంట, బిల్లకల్ నుండి ముల్లిప్పా వరకు ట్రాక్టర్లు, జీపులు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. కాలి నడకన వచ్చే భక్తుల కోసం అటవీ ప్రాంతంలో సూచించిన దారి వదిలేయకుండ నడిచి పొవాల్సి ఉంటుంది. మద్యలో దారి వదిలేస్తే లోతట్టు అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని భక్తులు గమనించాలని నిర్వహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం
ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు అధికం కావడం విశేషం.