Home తాజా వార్తలు వేములవాడలో ఘనంగా సీతారాముల కల్యాణం

వేములవాడలో ఘనంగా సీతారాముల కల్యాణం

Sri Sita Ramula Kalyanamరాజన్న సిరిసిల్ల  : వేములవాడలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం  శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. కల్యాణాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు.  సీతారామ కల్యాణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారాములకు పంచ ఉపనిషత్తు ద్వారా అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్లకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. కల్యాణం సందర్భంగా పట్టణ పురపాలక సంఘం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ ఆలయంలో శివుడికి, రాముడికి సమానంగా పూజలు చేస్తుంటారు. ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణం ప్రతిఏటా ఘనంగా చేస్తారు. శ్రీరామనవమి సందర్భంగా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది నుంచి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు కొనసాగుతున్నాయి. మహా శివరాత్రి తర్వాత ఆలయంలో జరిగే మరో పెద్ద పండుగ శ్రీ సీతారామ కల్యాణం కావడం విశేషం. తెలంగాణలో ఈనెల 14న శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఒక రోజు ముందే   వేములవాడలో సీతారాముల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Sri Sita Ramula Kalyanam at Vemulawada Temple