Thursday, April 25, 2024

కిలిమంజారోపై విరిసిన వెన్నెల

- Advertisement -
- Advertisement -

Sri Vennela

 

శ్రీ వెన్నెలకు ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థులు, అధ్యాపకులు

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు చెందిన ఈసం శ్రీవెన్నెల దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. మంగళవారం ఇల్లెందుకు చేరుకున్న శ్రీవెన్నెలకు పాఠశాల విద్యార్ధులు, అధ్యాపక బృందం ఘన స్వాగతం పలికారు. ఇల్లెందు మండలం, సుదిమళ్ళ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువున్న శ్రీవెన్నెల ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు దక్షిణాఫ్రికాలోని టాంజానియా ప్రాంతంలో గల కిలిమంజారో మంచు పర్వాతాన్ని అధిరోహించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన సంక్షేమ శాఖ గురుకులలాలకు చెందిన ముగ్గురు, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలలకు చెందిన ముగ్గురు మొత్తం ఆరుగురు విద్యార్ధులు, మరో ఆరుగురు సహయకులతో కూడిన 12 మంది సభ్యుల బృందం ఈ పర్వతాన్ని అధిరోహించింది.

పర్వతారోహణలో మొదటి రోజు 8 కిలోమీటర్లు, రెండవరోజున 11 కిలోమీటర్లు, 3వ రోజు 20 కిలోమీటర్లు ఎత్తు ఎక్కి పర్వతాన్ని మూడు రోజుల్లో అధిరోహించారు. పర్వతారోహణ పూర్తి చేసుకోని ఇల్లెందుకు చేరుకున్న ఈసం శ్రీ వెన్నెలకు పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి ప్రత్యేక వాహనంపై పట్టణ ప్రజలకు, తోటి విద్యార్ధులకు అధ్యాపకులకు అభివాదం తెలుపుతూ సుదిమళ్ళ పాఠశాల వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అరుణ కుమారీ, అధ్యపక బృందం ఆద్వర్యంలో శ్రీ వెన్నెలకు అభినందన సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా శ్రీ వెన్నెలను శాలువలు, పూల మాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు. వెనుకబడిన ఆదివాసీ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీ వెన్నెల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం వారి కుటుంబానికే కాదు పాఠశాలకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిపెట్టిందని ప్రధానోపాధ్యాయులు అరుణకుమారీ తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలని కోరారు.

Sri Vennela climbs Mount Kilimanjaro
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News