Home తాజా వార్తలు శ్రీదేవి డెత్ మిస్టరీ..?

శ్రీదేవి డెత్ మిస్టరీ..?

sreedevi

ముంబయి: శ్రీదేవి మరణించి మూడు రోజులు గడిచింది. మంగళవారం కూడా శ్రీదేవి దేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేఅవకాశం కనిపించడం లేదు. శ్రీదేవి భౌతికకాయం 36 గంటలుగా మార్చరీలోనే ఉంది. కేసు ఇప్పటికి ప్రాసిక్యూషన్ పరిధిలోనే ఉందని తెలుస్తోంది. శ్రీదేవి మృతి పట్ల గంట గంటకు పలు రకాల వార్తలు వస్తున్నాయి.  దుబాయ్ లో ఏ కేసు అయినా శ్రీదేవి కేసు తరహాలోనే  విచారణ జరుగుతుందని ఓ మీడియా ప్రతినిధి వెల్లడించారు. హై ప్రొఫైల్ కేసు అయినా సరే అదే  పద్ధతి పాటిస్తారు.  ఇక్కడి ప్రొసీజర్ లో భాగంగానే శ్రీదేవి కేసు విచారణ జరుగుతుంది.  విచారణ గురించి ప్రాసిక్యూషన్ అసంతృప్తి ఉంటే మళ్లీ దర్యాప్తునకు ఆదేశిస్తారని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే శ్రీదేవి భౌతికకాయానికి రీపోస్ట్  మార్టమ్ జరిగే అవకాశం ఉంది. శ్రీదేవి మృతిపై అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నామని దుబాయ్ పోలీసులు తెలిపారు.