Home గాసిప్స్ జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ..?

జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ..?

Sridevi's daughter Jhanvi Kapoor Entry in Tollywood

హైదారబాద్: టాలీవుడ్ లో అతిలోక సుందరి శ్రీదేవి ప్రస్థానం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో అందాల తారగా చెరగని ముద్ర వేశారామె. అయితే, శ్రీదేవి అకాలమరణం ఆమె అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. ఈ తరుణంలో ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇటీవల ‘దఢక్’ మూవీతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. మొదటి చిత్రంతోనే జాన్వీకి అభిమానుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. తొలి మూవీలోనే తనదైన నటతో అలరించిందామె. కాగా, తాజాగా జాన్వీ ఓ తెలుగు చిత్రంలో స్టార్ హీరో సరసన నటించనుందని, ఈ మేరకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు చర్చలు జరుపుతున్నారని తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. శ్రీదేవికి తెలుగులో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, జాన్వీని టాలీవుడ్ లో ఎంట్రీ చేయించాలని ఆమె తండ్రి బోనీ కపూర్ భావిస్తున్నట్టు సమాచారం.  ఓ స్టార్ హీరోతో తాను నిర్మించే చిత్రంలో జాన్వీని పరిచయం చేయాలని దిల్ రాజు… బోనీతో చర్చించారని తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై అటు దిల్ రాజు నుంచి గానీ, ఇటు బోనీ కపూర్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై వినిపిస్తున్న వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.