Home తాజా వార్తలు చెట్లను కాపాడాలి: శ్రీనివాస్ గౌడ్

చెట్లను కాపాడాలి: శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud

 

జనగామ: 32 కోటలను జయించి పేదలకు ఆండగా నిలిచిన మహావ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడు నూతలలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.  గోల్కొండ కోటను జయించిన మహానీయుడు సర్వాయి పాపన్న ప్రశంసించారు. రాబోయే రోజుల్లో గీతకార్మికులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని, గీత కార్మికులకు వృత్తి పన్నును తీసివేయాలని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు చెట్లను కాపాడి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

 

Srinivas Goud Praise Sarwai Papanna in Jangaon

 

Srinivas Goud Praise Sarwai Papanna in Jangaon