Home Default శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం లో మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం లో మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా

Srinivas Gupta Visits Nagarkurnoolనాగర్ కర్నూల్ : కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం లో జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు  తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఆయన జమ్మి మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతిఒక్కరు ఊరికో జమ్మి మొక్క, గుడికో జమ్మి మొక్క నాటాలని ఆయన పిలుపునిచ్చారు. కల్వకుర్తిలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి, అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీనివాస్ గుప్తాను వైశ్య ప్రముఖులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు పి. వెంకటేష్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కార్యదర్శులు ప్రభాకర్, రాజు, మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు విజయ్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం కోశాధికారులు కృష్ణయ్య, శంకర్, , మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోవర్ధన్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్, వాసవి క్లబ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, కిషన్, శేఖర్, శ్రీను, వెంకటేష్, తిరుపరయ్య, విజయభాస్కర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.