Home తాజా వార్తలు అప్పుడు మెచ్చుకున్నారు… ఇప్పుడు విమర్శలెందుకు: శ్రీనివాస్ గౌడ్

అప్పుడు మెచ్చుకున్నారు… ఇప్పుడు విమర్శలెందుకు: శ్రీనివాస్ గౌడ్

V Srinivas Goud

 

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌కు పాలమూరు ప్రజల తరపున కృతజ్ఞతలు చెబుతున్నానని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదికల్లా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తామని సిఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కెసిఆర్ ప్రభుత్వం పనితీరును బిజెపి నేతలు కావాలనే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గతంలో రైతుబంధు పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించలేదా అని రాష్ట్ర బిజెపి నేతలను ప్రశ్నించారు. మిషన్‌భగీరథ అద్భుత పథకమని ప్రధాని ప్రశంసించిన మాట వాస్తవం కాదా?… తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారన్నారు. పని చేసే ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర బిజెపి నేతలకు సూచించారు. బిజెపి పాలిత రాష్ట్రాల పనితీరును ఎప్పుడైనా పరిశీలించారా? అని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. కెసిఆర్ ప్రభుత్వం పనితీరును నీతిఆయోగ్ సైతం ప్రశంసించిందని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. గతంలో రాష్ట్రానికి మరిన్ని నిధులు విడుదల చేయాలని నీతి ఆయోగ్ సైతం సిఫారసు చేసిందని, గతంలో పలువురు కేంద్రమంత్రులు రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసించారన్నారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంటే బిజెపి నేతలు ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు.

 

Srinivasa Comments on Telangana BJP Leaders

 

Srinivasa Comments on BJP Leaders