Home తాజా వార్తలు ప్రాజెక్టుల పరవళ్లు

ప్రాజెక్టుల పరవళ్లు

Srisailam project

 

నాగర్‌కర్నూల్ : కృష్ణానదికి ఈ ఏడాది రెండు పర్యాయాలు వరదలు రావడంతో కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ అలమట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద రావడంతో జురాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. జురాల ప్రాజెక్టు పరిధిలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా నీటిని నెలరోజులుగా నిరంతరాయంగా ఎత్తిపోస్తున్నారు. దీంతో ఆ ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు,చెరువు లు, కుంటలు, కాలవలు నిండుకుండలా మారాయి. వరద వందల టిఎంసీలలో రావడంతో దిగువన ఉన్న శ్రీశైలంకు వరద రావడతో 885 అడుగుల మేర ఉన్న ,.

15 రోజుల వ్యవధిలో ప్రా జెక్టులో భారీగానీరు చేరడంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, హెడ్‌రెగ్యులేటర్లు, కాలువల ద్వారా సాగునీటి అవసరాలకు భారీగా నీటిని వినియోగిస్తున్నారు. శ్రీశైలం తిరుగుజలాలపై ఆధారపడ్డ తెలంగాణకు చెందిన ప్రాజెక్టులలో ఒక్కటైన మహాత్మగాంధి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 20 రోజులుగా ప్రతి రోజు 2400 టిఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నారు. అదే విధంగా శ్రీశైలం తిరుగుజలా లపై ఆధారపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హాంధ్రినివా సుజల స్రవంతి ద్వారా పొరుగు రాష్ట్రం నీటిని వినియోగిస్తుంది.

పోతిరెడ్డిపాడు ద్వా రా ప్రతి రోజు 28 వేల 500 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా హంధ్రినివా సుజల స్రవతి ద్వారా 2026 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. సుంకేసుల నుంచి ప్రతి రోజు 60 వేల క్యూసెక్కుల వరద వస్తుడడంతో నేరుగా ము చ్చుమర్రి కెసిసి కెనాల్ ద్వారా రాయలసీమాకు నీటిని తరలిస్తున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రం తాగునీటి అ వసరాలకోసం మిషన్‌భగీరథద్వారా నీటిని వినియోగిస్తున్నారు.

ప్రాజెక్టులకు జలకళ..పొలం పనుల్లో రైతులు
కృష్ణానదితో సమృద్ధిగా నీరు ఉండడం నెలరోజులుగా ప్రాజెక్టులలో నీటిని ఎత్తిపోస్తుండడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కృష్ణానది జలాల పై సాగు చేసే రైతులు ఇప్పటికే వరి పంటలను సాగు చేశారు. అనేక మంది రైతులు ప్రాజెక్టుల కాలువలు, కాలువల నుంచి మోటర్ల ద్వారా నీటి పై ఆధారపడ్డ రైతులు వేరుశనగ సాగు చేయడానికి తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో రైతులు విస్తృతంగా వేరుశనగను సాగుచేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

శ్రీశైలం, జురాలకు యధావిధిగా వరద
కృష్ణానదికి ఎగువ అలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర నదుల ద్వారా వరద ఉదృతంగా కొనసాగుతుంది. మంగళవారం కృష్ణానదికి కర్ణాటక నుంచి లక్షా 36 వేల 158 క్యూసెక్కుల నీటిని 11 గేట్లను ఎత్తి నారాయణపూర్ డ్యాం నుంచి దిగువ జురాలకు వదులుతున్నారు. అదే విధంగా తుంగభద్ర నది ద్వారా వస్తున్న వరదను సుంకేసుల ద్వారా 53 వేల 768 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలంకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి 3 లక్షల 90 వేల 830 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 884.90 అడుగులకు చేరుకుంది. అధికారులు సోమవారం రాత్రి అప్రమత్తంగా వ్యవహరించకపోవడతో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వేల పై నుంచి వరద నీరు ప్రవహించాయి. దీంతో మంగళవారం ఉదయం అధికారులు అప్రమత్తమై ఆరు గేట్లు 10 అడుగుల మేర ఉండగా వెంటనే ఆ ఆరు గేట్లను 23 అడుగులకు ఎత్తి స్పిల్‌వేల ద్వారా 3 లక్షల 20 వేల 136 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు వదలడంతో స్పిల్‌వేల పై నుంచి ప్రవహిస్తున వరద నీరు నిలిచిపోయింది. అధికారులు ఇన్‌ఫ్లో ను అంచనా వేయండంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రాజెక్టులలో చేరిన నీటి వివరాలు
కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులలో ఉన్న నీటి నిలువ వివరాలు మంగళవారం సా యంత్రం 6 గంటల వరకు అం దిన సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని నా రాయణపూర్ డ్యాంలో 31 .45 టిఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. ఇక్కడ నారాయణపూర్ డ్యాంకు అలమట్టి నుంచి లక్షా 80 వే ల క్యూసెక్కుల నీరు వ చ్చి చేరుతుండడంతో 11 గేట్లను ఎత్తి దిగువ జురాల కు లక్షా 36 వేల 158 క్యూ సెక్కుల నీటిని వదులుతున్నా రు. అదే విధంగా జురాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.111 టిఎంసీలు కాగా ప్రాజెక్టులో 9.65 టిఎంసీల నీరు ని ల్వ ఉన్నాయి . జురాల కు 2 లక్షల 65 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో 22 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు ఏదావిధిగా వదులుతున్నారు.

జురాలలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రలో 12 యూనిట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి 32 వేల 320 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. విద్యుత్తు అవసరాల అనంతరం అట్టి నీరు శ్రీశైలానికి వెళ్తున్నాయి.అదే విధంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 750 క్యూసెక్కులు, భీమా 1 ఎత్తిపోతల ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌ఎత్తిపోతల ద్వారా 630 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. లెఫ్ట్, రైట్ కెనాల్ ద్వారా 1652 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భీమా లిఫ్ట్ 2 తో పాటు సమాంతర కాలువ ద్వారా 1400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధం 215.807 టిఎంసీలు కాగా ప్రస్తుతం 215.3263 టిఎంసీల నీరు నిల్వ ఉన్నాయి.

శ్రీశైలం వద్ద గల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్తు అవసరాల నిమిత్తం 29 వేల 500 క్యూసెక్కుల నీటిని తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి అవసరాల కోసం 42 వేల 378 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.మహాత్మగాంధి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం 2400 క్యూసెక్కులు, హాంధ్రినివా సుజలస్రవంతికి 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 28 వేల 500 క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వినియోగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచిస్పిల్‌వేల ద్వారా 3 లక్షల 20 వేల 136 క్యూసెక్కుల నీరు నేరుగా నాగార్జున సాగర్‌కు వదులుతుండగా మారో లక్ష క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు పై ఆధారపడ్డ సాగునీరు, విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్నారు.

మరో రెండు రోజుల పాటు యధావిధిగా వరద
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రాలలో వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదికి ఈ ఏడాది రెండవ సారి వరద కొనసాగుతుంది. మరో రెండు రోజుల పాటు వరద ఉదృతి యాధావిధిగా ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణాబేసిన్‌లోని ఎగువ కర్ణాటక అధికారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులకు ఈ మేరకు సమాచారం అందించినట్లు తెలిసింది.

Srisailam project became filled for second time