Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రేపు శ్రీవారి ఆలయం మూసివేత

రేపు శ్రీవారి ఆలయం మూసివేత

Tirumalaతిరుమల: మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో మంగళవారం  శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు టిటిడి అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని వారు వెల్లడించారు. తిరిగి బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని వారు చెప్పారు. ఆలయశుద్ధి, పుణ్యవచనం అనంతరం ఉదయం 10 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్టులను అనుమతిస్తామని వారు పేర్కొన్నారు. మంగళవారం సర్వ, దివ్య దర్శనం టోకెన్లను రద్దు చేసినట్టు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం భక్తులు తిరుమలకు రావొద్దని వారు సూచించారు.

Srivari Temple Closure Tomorrow