సౌత్‌బ్యూటీ శృతిహాసన్ బాలీవుడ్‌లోనూ గ్లామరస్ తారగా సత్తాచాటుతోంది. ఈ భామ కాశ్మీర్లో ఓ హిందీ సినిమా షూటింగ్ పూర్తిచేసి… పవన్‌కళ్యాణ్ ‘కాటమరాయుడు’ చిత్రీకరణలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చేసింది. ప్రస్తుతం పవన్ చిత్రం షూటింగ్ తుది దశలో ఉంది. పవన్, శృతిహాసన్‌లపై పాటలను చిత్రీకరించనున్నారు. రొమాంటిక్ డ్యూయెట్స్‌లో ఈ స్టార్ జంట ఉల్లాసంగా… ఉత్సాహంగా స్టెప్పులు వేయనుంది. ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ “కాటమరాయుడు షూటింగ్ కోసం హైదరాబాద్‌కు తిరిగివచ్చాను. హుషారైన పాటల్లో పవన్‌తో కలిసి డ్యాన్స్ చేయబోతున్నా”అని పేర్కొంది. ఇక రాయలసీమకు చెందిన ఫ్యాక్షన్ లీడర్‌గా పవన్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యంలో పాటలు రూపుది ద్దుకుం టున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఉగాది పండుగ కానుకగా ‘కాటమరాయుడు’ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు ఫిల్మ్‌మేకర్స్.
డ్యూయెట్స్‌లో స్టెప్పులు
- Advertisement -
- Advertisement -