Friday, March 29, 2024

ఔట్ సోర్సింగ్‌ పద్ధతిలో 1640 స్టాఫ్ నర్సుల నియమాకాలు

- Advertisement -
- Advertisement -

Staff nurses

 

హైదరాబాద్ : రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 1640 మంది స్టాఫ్ నర్సుల నియమాకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్ధిపేట వైద్య కళాశాలకు 361, నిలోఫర్ ఆసుపత్రికి 278, రిమ్స్ ఆదిలాబాద్‌కు 169, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి 160, గాంధీకి 137, నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాలకు 121, ఉస్మానియాకు 104, ఎంజిఎం వరంగల్‌కు 65, ప్రభుత్వ మెటర్నిటి ఆసుపత్రి సుల్తాన్ బజార్‌కు 64, పెట్లబూర్జు ఆసుపత్రికి 60, సికెఎం వరంగల్ ఆసుపత్రికి 40, మహబూబ్‌నగర్ వైద్య కళాశాలకు 19, ఇఎన్‌టి ఆసుపత్రికి 15, హన్మకొండ ప్రభుత్వ మెటర్నిటి ఆసుపత్రికి 14, మెంటల్ ఆసుపత్రికి 10, ఫీవర్ ఆసుపత్రికి 10, చెస్ట్ ఆసుపత్రికి 08, టిబి, సిడి ఆసుపత్రికి 05 మొత్తం 1640 ఔట్ సోర్సింగ్ పోస్టులకు అనుమతించారు. ఇదిలా ఉండగా పాలియేటివ్ కేర్ ప్రొగామ్, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ సేవల కోసం 688 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతించింది.

 

Staff nurses recruitment in medical colleges
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News