Home జాతీయ వార్తలు ప్రేమోన్మాది…. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి… ఆత్మహత్య

ప్రేమోన్మాది…. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి… ఆత్మహత్య

తిరువనంతపురం: ఓ ప్రేమోన్మాది యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, తాను కూడా నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేరళలోని ఎర్నాకులం జిల్లా కకానాడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మిథున్ అనే వ్యక్తి సదరు అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి వేధించేవాడు. గతంలో అమ్మాయి (17) తల్లి తరుపు బంధువు అతడు కావడంతో మందలించి వదిలేశారు. గత వారం రోజుల క్రితం అమ్మాయిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని మిథున్ బెదిరించడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. మిథున్ పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో అమ్మాయిపై పగ పెంచుకున్న మిథున్ గురువారం వాళ్ల ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పింటించాడు. తాను కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే తండ్రి స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తల్లి స్పృహ తప్పిపడిపోయింది.

మిథున్‌ను కూడా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మిథున్, అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళలో గతంలో ఇలాంటి ఘటనలు నాలుగు చోటుచేసుకున్నాయని పోలీసుల వెల్లడించారు. మార్చిలో కవిత విజయ్ కుమార్ అనే అమ్మాయిపై ప్రేమోన్మాది నిప్పంటించి తగలబెట్టాడు. కవిత చికిత్స పొందుతూ వారం రోజుల తరువాత మృతి చెందింది. ఏప్రిల్‌లో నీతూ (22) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రేమోన్మాది నిధీస్ కత్తితో పొడిచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. వల్లికన్నన్ పోలీస్ స్టేషన్‌లో పని చేసే మహిళ కానిస్టేబుల్ పుష్పకరణ్‌పై సహోద్యోగి కత్తితో పొడిచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. వీళ్లు అందరూ చనువుగా ఉండి అమ్మాయిలు పెళ్లికి నిరాకరించడంతోనే ఈ హత్యలు చేశారని పోలీసులు వెల్లడించారు.

 

Stalker Burn on Girl after his Suicide in Kerala