Thursday, April 18, 2024

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

corona vaccine

 

వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 7000 మంది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ ప్రారంభమైంది. సీటెల్ లోని కైజర్ పెర్మనెంటె వాషింగ్టన్ హెల్తు రీసెర్చి ఇనిస్టిట్యూట్ (కెపిడబ్లుహెచ్‌ఆర్‌ఐ) పరిశోధకులు ఈ వ్యాక్సిన్ ఎంఆర్‌ఎన్‌ఎ1273ను ఒక వ్యక్తిపై ప్రయోగించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్‌ఐఎఐడి) శాస్త్రవేత్తలు కేంబ్రిడ్జి, మసాచుసెట్స్ కేంద్రంగా ఉన్న బయోటెక్నాలజీ కంపెనీ మోడెమా సంస్థ శాస్త్రవేత్తల సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. భారత్, నార్వే సహకారంతో తొలిదశ ప్రయోగాన్ని ప్రారంభించారు. వేగంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ప్రారంభం చరిత్రలో ఇదే తొలిసారి అని, ఒక వ్యక్తిపై ప్రయోగం ప్రారంభమైందని తెలియచేయడానికి సంతోషిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శ్వేతభవనం లోని పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు.

Start of corona vaccine clinical trial in USA
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News