Home వరంగల్ నిఘా నీడలో కమిషనరేట్

నిఘా నీడలో కమిషనరేట్

 Start Petrogar guards Warangal Police Commissioner

మనతెలంగాణ/వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24-7 నిఘా ఏర్పాటు చేయడం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన బ్లూకోల్ట్, పెట్రోకార్ బృందాలను వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వి.రవీందర్ మాట్లాడు తూ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు శాంతిభద్రతలపై భరోసా కల్పించడంతో గతంలో నేరాలకు పాల్పడిన నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నేరాల నియంత్రణ, విజుబుల్  పోలీసింగ్‌లో  పోలీ స్ కమిషనరేట్ 24-7 గంటలు నిఘా ఏర్పాటుకై నూతనంగా బ్లూకోల్ట్, పెట్రోకార్ బృందాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఐదు ముఖ్యమైన ఉద్దేశాలతో ఈ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా అత్యవసర సమయాల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతో పాటు, నగరంలో ఫిర్యాదు చేసిన ప్రాంతానికి ఐదు నిముషాల్లో బ్లూకోల్ట్ లేదా పెట్రోకార్ బృందాలు చేరుకొని ఫిర్యాదు దారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై ఈ బృందం సభ్యులు తక్షణమే స్పందిస్తారు. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా బ్లూకోల్ట్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లోని  అన్ని వర్గాల ప్రజలతో పాటు, స్థాయి యువత సత్సంబంధాలను కొనసాగించడం, ముఖ్యంగా గత ంలో నేరాలకు పాల్పడిన నేరస్తుల స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, మతపరమైన, శాంతిభద్రతలకు సంబంధించి ఏదైనా సమస్యలపై ఈ బ్లూ కోల్ట్ బృందాలు ముందస్తు సమాచారాన్ని సేకరించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని కలిగించడంతో పాటు, ప్రజల ఆలోచనలకు తగ్గట్లుగా కమిషనరేట్ పోలీసులు విధులను నిర్వర్తించడం జరుగుతు ందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. అనంతరం నూతనంగా ప్రారంభించబడిన ఈ బృందాలపై ప్రజ ల్లో  మరింత అవగాహన కల్పించడం కోసం ఈ బృందాలు పోలీస్ కమిషనరేట్ నుంచి హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్డు, ఎంజిఎం, హన్మకొండ మీ దుగా నక్కలగుట్ట, కాజీపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ అదనపు డిసిపి మురళీధర్, ఎసిపిలు రాజేంద్రప్రసాద్, సత్యనారాయణ, ప్రభాకర్, విద్యాసాగర్, సదానందం, శ్రీనివాస్, శోభన్‌కుమార్, ఇన్స్‌పెక్టర్లు, రాఘవేందర్, విశ్వేశ్వర్, రిజర్వు ఇన్స్‌పెక్టర్లు, సతీష్, నాగయ్య, శశిధర్, అశోక్‌కుమార్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.