Home జిల్లాలు అమ్మా బైలెల్లినాదో… తల్లి బైలెల్లినాదో

అమ్మా బైలెల్లినాదో… తల్లి బైలెల్లినాదో

bonula– ముస్తాబైన గ్రామ దేవతల ఆలయాలు
– మొదలైన బోనాల జాతర
నిజామాబాద్‌సాంస్కృతికం: నాగరికత పరిఢవిల్లిన మానవ సమాజాలలో ప్రకృతి ఆరాధన, శక్తి ఆ రాధన పరంపరాగతంగా వస్తుంది. ప్రాంతీయ ఆచార వ్యవ హారాలను బట్టి ఈ ఆరాధన విధానాలు మారుతుంటాయి. దక్షిణాయన ప్రారంభంలో వరుణుడు కరుణించి ప్రకృతి మాత పులకించగా… వ్యవసాయంపై ఆధారపడిన ఆ ప్రాం త ప్రజలు భక్తి ప్రపత్తులతో మహాశక్తిని విభిన్న రూపాలలో పోల్చుకోవడం అనాధిగా.. ఆచారంగా వస్తోంది. అలాంటి ఆచారాల్లో శక్తి ఆరాధనలో భాగంగా తెలంగాణ ప్రజలు జ రుపుకునే బోనాల పండగ ఎంతో ప్రసిద్ధి గాంచింది. తెలం గాణ సంస్కృతికి అద్దం పడుతు నిజామాబాద్ నగరంలో రైతన్నలు జరుపుకునే పెద్ద పండుగ బోనాలు. దీనినే ఆషాడ జాతర అని కూడా అంటారు. ఈ జాతరను ఆషాడ మా సంలో…వర్ష రుతువు ప్రారంభమయ్యేటప్పుడు జరుపుకోవ టం సాంప్రధాయం. భక్తి శ్రద్ధలతో గ్రామదేవతలకు బోనం సమర్పించి ధూప దీప నైవాద్యాలను నివేదించడం అనవా యితి. ఇలా చేస్తే కుటుంబ సౌఖ్యం, పశుసంపద, పాడిపం టలు, సకాలంలో వర్షాలు పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతా యని ప్రజల ప్రగాఢ విశ్వాసం.ఆషాడ మాసం రెండవ ఆది వారం నగరంలో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహి ంచారు. గ్రామ దేవతలైన పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, మ హాలక్షమమ్మ , పగడాలమ్మ తదితర అమ్మవార్లను భక్తి శ్రద్ధ లతో పూజించి ధూప దీప నైవేద్యాలను అమ్మవారికి ఇష్ట మైన వేపఆకులతో అలంకరించిన బోనాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనం సమర్పించటం వలన దు ష్ట శక్తులు దూరమై పిల్లాపాపలు ఆరోగ్యంగా ఉంటారని పా డిపంటలు సంవృద్దిగా పండుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌లోని కాళీకా మాత ఆలయం, ఏడుపాయల కనకదుర్గమ్మ ఆలయం, పో చమ్మగల్లీ పెద్ద పోచమ్మ మందిరం, దేవి రోడ్ నల్ల పోచమ్మ ఆలయం దుబ్బ మహాలక్ష్మి ఆలయం,గౌతమ్ నగర్ మైస మ్మ ఆలయం,ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి, ఊరేగింపు కార్యక్రమం నయనానందకరంగా కొనసాగింది .
పవిత్రం బోనం ..
ఆదివారం ఆషాడం జాతర బోనాలకు ముఖ్య దినం. ఈ రోజున మహిళ భక్తులు ఎంతో పవిత్రంగా ఉండి బోనాన్ని గ్రామ దేవతలకు సమర్పిస్తారు. స్త్రీలు తలారా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి వారు మొక్కుకున్న ప్రకారం బోనం ప్రసాదం తయారు చేసి ఒక పాత్రలో పెట్టి అప విత్రం కాకుండా ఆబోనం పాత్రపై దీపం జ్యోతి పెట్టి ఆపా త్రను తలపై పెట్టుకొని గ్రామ దేవత ఆలయానికి వెళ్లి బో నం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. దీనినే బోనం లేదా బోనాల పండుగ అని అనాదిగా పిలుస్తున్నారు. బో నాల పండుగ రోజు స్త్రీలు ముఖానికి పసుపు రాసుకొని రా వటం సనాతనమైన ఆచారం.కొంత మంది స్త్రీలు పరిశుభ్ర మైన నీటిని పసుపుతో కలిపి పాత్రలలో నింపుకొని, వేప మ ండలు ఆపాత్రలో ఉంచి గ్రామదేవత ఆలయానికి వచ్చి అ మ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకోవడం అనవాయితీ. ఇలా చేస్తే అమ్మవారి చల్లని దీవెనలు లభిస్తాయని భక్తుల నమ్మకం.నగరంలోని వివిధ కులాలతో పాటు ముదిరాజ్ సంఘం అధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగ, జాతర ఘనంగా జరిగింది. ఆయా కులదేవతలకు ప్రత్యేక పూ జలు చేసి బోనం నైవేద్యం సమర్పించారు.
కామారెడ్డిలో…
కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో బోనాల పండు గ ఆదివారం ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సం ఘం, హొలియదాసరి సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో వేర్వేరుగా బోనాల ఊరేగింపు నిర్వహించి గ్రామ దేవత లకు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్వంలో గ్రామంలోని పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ దేవతలకు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు బాగా కురవాలని కోరుకున్నారు.
పాడి పంటలు చల్లగా వుండాలని మొక్కు కున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బెజ్జంకి సుదర్శన్, సంఘ ప్రతినిధులు రాములు, రమణ, భూమ య్య, సుదర్శన్, రాజు, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా హొలియ దాసరి సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో దత్తాత్రేయ కాలనీలోని ముత్యాలమ్మ, పోచమ్మ, భూలక్షమ్మ, మదన పోచమ్మ గ్రామ దేవతలకు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పిం చుకొని మొక్కులు తీర్చుకున్నారు.
అందంగా అలంకరించిన బోనాలను మహిళలు నెత్తిన పె ట్టుకొని డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బోనాలను అమ్మవార్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హొలియా దాసరి ప్రతినిధులు కర్రెపు న ర్సింలు, గంగయ్య, పెద్దపోచయ్య, చిన్నపోచయ్య, వెంకటే శ్, చిన్న నర్సింలు, నడిపి సాయిలు, చిన్ననల్ల పోచయ్య, పెద్ద సాయిలు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.