Tuesday, April 16, 2024

మనోళ్లకే కొలువులు

- Advertisement -
- Advertisement -

నూతన విధానానికి కేబినెట్ ఆమోదం

రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో తెలంగాణ యువతకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు

 అలాంటి పరిశ్రమలకు అదనపు రాయితీలు

 ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం
 పనికిరాని ప్రభుత్వ పాత వాహనాల విక్రయం

 నిరాడంబరంగా పంద్రాగస్టు

 వలస కార్మికులకు పాలసీ
 టిఎస్ బిపాస్ ఓ పెద్ద సంస్కరణ
 దుమ్ముగూడేనికి సీతమ్మ సాగర్, బస్వాపూర్‌కు నృసింహస్వామి రిజర్వాయర్

 తుపాకులగూడేనికి సమ్మక్క బ్యారేజీగా నామకరణం
 సిఎం కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ 8 గంటల సుదీర్ఘ భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షత జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా కొత్త సచివాలయం సముదాయం, డిజైన్లు, హైదరాబాద్ చుట్టూ ఐటి విస్తరణ కోసం రూపొందించిన ప్రత్యేక గ్రిడ్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మరో రూ.100 కోట్లు మంజూరు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి పదకొండు గంటల వరకు ఏకదాటిగా సుమారు తొమ్మిది గంటల పాటు సాగింది. ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో  పెరిగిపోతున్న నిరుద్యోగులకు పెద్దఎత్తున ఉపాధి అవకశాలు కల్పించేందుకు మంత్రివర్గ సమావేశం కూలంకషంగా చర్చించింది. తదనంతరం ప్రత్యేక విధానానికి మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టిఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పరిశ్రమల శాఖను ఆదేశించారు. దీనిపై మంత్రి కెటి రామారావు ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదా తయారు చేసింది.
ప్రధానంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికేలకే అధిక అవకాశం లబించేందుకు నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంతో రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
నగరం చూట్టూ ఐటి పరిశ్రమలు
హైదరాబాద్ నగరంలో ఐటి పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్ అభిప్రాయపడింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటి కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సహకాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ గ్రిడ్ పాలసిని కేబినెట్ ఆమోదించింది.
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రొత్సాహం
పెరిగిపోతున్న వాహనాల వల్ల ఎక్కువయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రా్రష్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీకి కూడా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
కరోనా కట్టిడికి మరో రూ.100 కోట్లు
వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స- ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, వివిధ విభాగాధిపతులను సమావేశానికి ఆహ్వానించి చర్చించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు కరోనా పరిస్థితిపై సిఎం కెసిఆర్‌కు సమగ్ర వివరాలు అందించారు. ప్రసు తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు పాకిన కరో నా ప్రస్తుతం పెద్ద నగరాల్లో బాగా తగ్గుముఖం పట్టిందని, అదే విధంగా హైదరాబాద్‌లోనూ కేసు లు తగ్గుతున్నాయని రాష్ట్ర మంత్రివర్గానికి వైద్యు నిపుణులు వివరించారు. పైగా తెలంగాణలో మరణాలు రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతున్నదన్నారు. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్యనిపుణులు తెలిపారు. దీనిపై సిఎం కెసిఆర్ స్పందిస్తూ, కరోనాపై ప్రజలు పెద్దగా ఆం దోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఎక్కువ వ్య యం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్ ప్రజలను కోరింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎన్నిడబ్బులైన వెనకాడేది లేదని స్పష్టం చేసింది. తదనంతరం ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. వాటిల్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డెసి విర్, లోమాలిక్యులర్ వెయిట్ హెపారిన్, డెక్సామిథజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పిపిఇ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. వైద్య పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 10 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది. 3.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించే అధికారం కలెక్టర్లకు ఇచ్చింది. .రాష్ట్ర వ్యా ప్తంగా 10 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచండంతో పాటు కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇటీవల ప్రభు త్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో రూ. 100 కోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెల వారీగా ఖచ్చితంగా విడుదల చేయాలని సూచించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భ రిం చాలని నిర్ణయించింది. రోజూ 40వేల వరకు పరీ క్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
నేడు వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించిన అంశాలతో పాటు కరోనా కట్టిడికి సిఎం కెసిఆర్ చేసిన సూచనలపై సంబంధిత అధికారులతో మంత్రి ఈటల రాడేందర్, సిఎస్ సోమేశ్ కుమార్ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో అవసరాలు తెలుసుకుంటారు. వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే కరోనా రోగులకు అందించే వైద్యం కూడా సమగ్రంగా తెలుసుకోనున్నారు.

State Cabinet meeting chaired by CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News