Home నిర్మల్ అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందడమే ధ్యేయం

అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందడమే ధ్యేయం

State government will be developed in all sectors

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

మన తెలంగాణ/నిర్మల్ రూరల్: ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గృహానిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మించిన మాల, మాదిగ సంఘల కమ్యూనిటి హాల్, రూ. 10 లక్షలతో నిర్మించిన వైకుంఠాదామంను ప్రారంభించారు. అనంతరం 42 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ది చెందాలన్నారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్‌ల త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఆగస్టులో ఇంటింటికి తాగునీరు అందిస్తామని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు గల రైతులకు రూ. 5లక్షల బీమా సౌకర్యం కల్పించిందన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్‌పి చైర్‌పర్సన్ శోభసత్యనారాయణగౌడ్, ఎఎంసి చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్ల వెంకట్ రామ్‌రెడ్డి, ఎంపిపి దౌలన్‌బి మౌలానా, సర్పంచ్ సహారబాను మైనొద్దిన్, అధికారులు,నాయకులు, ప్రజలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.