Thursday, March 28, 2024

భీమా కోరేగావ్ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది

- Advertisement -
- Advertisement -

Uddhav-Thackeray

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు. భీమా-కోరేగావ్ హింసాకాండ కేసును తన ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఠాక్రే ప్రకటించారు. 2017 డిసెంబర్ 31న పుణెలోని శనివార్‌వాడలో జరిగిన ఎల్గార్ పరిషద్ సభలో కొందరు రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగాల కారణంగా భీమా-కోరేగావ్ హింసాకాండ చోటుచేసుకుందని ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం ఎల్గార్ పరిషద్ కేసును కేంద్రం అధీనంలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎల్గార్, భీమా-కోరేగావ్ అన్నవి రెండు వేర్వేరు అంశాలని, తన దళిత సోదరులు ఎదుర్కొంటున్న కేసులు భీమా కోరేగావ్‌కు చెందినవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భీమా-కోరేగావ్ కేసును కేంద్రానికి అప్పగించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దళిత సోదరులకు అన్యాయం జరగనివ్వబోనని ఆయన హామీ ఇచ్చారు. కాగా, ఎల్గార్ పరిషద్ కేసు దర్యాప్తును ఎన్‌ఐఎకి అప్పగించాలన్న ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయంపై గతవారం ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్‌తోపాటు ఎన్‌సిపి కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

State govt will take up Bhima Koregaon probe, says Uddhav Thackeray, Sharad Pawar had publicly expressed his unhappiness over Thackeray decision to hand over the Elgar Parishad probe to the NIA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News