Thursday, March 28, 2024

రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…. భారత్@2.36 లక్షలు

- Advertisement -
- Advertisement -

State wise coronavirus update in india

 

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్. థానే, పూణే వంటి నగరాలలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. దాదాపుగా సగం కేసులు (1.3 లక్షలు) ఈ నగరాలలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 80 వేల ఉండగా 2849 మంది మృత్యువాతపడ్డారు. ఒక మహారాష్ట్రాలో కరోనా కేసుల సంఖ్య లక్షకు పైగా ఉండొచ్చని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా వైరస్ ధాటికి ముంబయి విలవిలలాడుతోంది. ముంబయిలో ఎటు చూసిన కరోనా రోగులే కనిపిస్తున్నారు. ఒక్క ముంబయిలోనే దాదాపుగా 46 వేల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో దాదాపుగా పది వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో ఆరో స్థానానికి పడిపోయింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా టెస్టులు సరిగ్గా చేస్తే రెండు నుంచి మూడు లక్షల మధ్య బాధితులు ఉంటారని స్థానిక మీడియా తెలిపింది. భారత్ కరోనా వైరస్ 2.36 లక్షల మందికి సోకగా 6649 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 1.13 లక్షల మంది కోలుకోగా 1.16 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు

 

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
80,229 42,224 35,156 2,849
తమిళనాడు
28,694 12,697 15,762 235
ఢిల్లీ 26,334 15,311 10,315 708
గుజరాత్ 19,119 4,918 13,011 1,190
రాజస్థాన్ 10,084 2,507 7,359 218
ఉత్తర ప్రదేశ్ 9,733 3,828 5,648 257
మధ్య ప్రదేశ్ 8,996 2,734 5,878 384
ఏ రాష్ట్రం గుర్తించినవారు 8,192 8,192 0 0
పశ్చిమ బెంగాల్ 7,303 4,025 2,912 366
కర్నాటక
4,835 3,083 1,693 57
బిహార్ 4,598 2,336 2,233 29
ఆంధ్ర ప్రదేశ్ 4,250 1,612 2,565 73
హర్యానా 3,597 2,364 1,209 24
జమ్ము కశ్మీర్ 3,324 2,202 1,086 36
తెలంగాణ 3,290 1,550 1,627 113
ఒడిశా 2,608 994 1,604 10
పంజాబ్ 2,461 344 2,069 48
అస్సాం 2,244 1,727 510 4
కేరళ 1,700 973 712 15
ఉత్తరాఖండ్ 1,215 856 344 11
ఝార్ఖండ్ 922 480 435 7
ఛత్తీస్ గఢ్ 863 630 231 2
త్రిపుర
694 521 173 0
హిమాచల్ ప్రదేశ్ 393 199 185 6
ఛండీగఢ్ 309 31 273 5
గోవా 196 131 65 0
మణిపూర్ 137 99 38 0
నాగాలాండ్ 107 107 0 0
పుదుచ్చేరీ 104 61 43 0
లడఖ్ 97 48 48 1
అరుణాచల్ ప్రదేశ్ 46 45 1 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
మేఘాలయ 33 19 13 1
మిజోరం 24 23 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ 14 13 1 0
సిక్కిం 3 3 0 0
మొత్తం 2,36,781 1,16,887 1,13,233 6,649
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News