Wednesday, April 17, 2024

ఏప్రిల్‌ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని అన్నారు.  ప్రజలంతా లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ప్రస్తుతం 1654 మంది క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. పదోతరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏప్రిల్ 15 వరకు పంటపొలాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. కరోనా వైరస్ తో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారన్నారు. మర్కజ్ నుంచి వచ్చిన 1200 మందిని గుర్తించాం అని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు 34 మంది డిశ్చార్జ్ అయ్యారని సిఎం కెసిఆర్ తెలిపారు.

 

Statewide lockdown until 30th of this month
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News