Friday, April 26, 2024

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహాత్మఫూలే మహా విగ్రహం

- Advertisement -
- Advertisement -

Mahatma Phule

 

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలేకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సముచిత గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ ఇస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. నగరంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో, హుస్సేన్ సాగర్‌కు అతిసమీపంలో వెను కబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు భారీ విగ్రహ ఏర్పాటుకు అనుకూల స్థలాన్ని మంత్రుల బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ బొంతు రామ్మోహన్‌లు పరిశీలించారు.

వెనుకబడిన వర్గాలకు ఆధునిక విద్య: శ్రీనివాస్‌గౌడ్
ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ ఆదేశాల మేరకు, మంత్రి కెటిఆర్ సూచనల మేరకు వెనుకబడిన తరగతుల, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే భారీ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి సంకల్పించామని అందులో భాగంగా సరైన స్థలాన్ని పరిశీలిస్తున్నామ న్నారు. ఇప్పటికే మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో వందల గురుకులాలను స్థాపించి వారి ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలకు ఆధునిక విద్యతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యాసానికి ఓవర్సీస్ విద్య పథకాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. బిసిల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం కేటాయించిందన్నారు. నెక్లెస్ రోడ్డు కూడళ్ల వద్ద ఉన్న 2,000 వేల గజాల విలువైన స్థలాన్ని ప్రాథమికంగా ఎంపిక చేసి మంత్రి కెటిఆర్‌కు, సిఎం కెసిఆర్‌కు నివేదిక అందజేస్తామన్నారు.

కెసిఆర్‌కు కృతజ్ఞతలు: మంత్రి శ్రీనివాస్ యాదవ్
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ బిసి పక్షపాతి అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి అంబేద్కర్‌కు స్ఫూర్తిగా నిలిచి రిజర్వేషన్లకు మూలకారణంగా నిలిచిన మహాత్మా జ్యోతిరావు పూలేకు సముచితమైన గౌరవాన్ని అందించాలన్న ఉద్ధేశ్యంతో హైదరాబాద్ నడిబొడ్డున పూలే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

వెనుకబడిన వర్గాల స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు పూలే: గంగుల
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన గత 70 సంవత్సరాల్లో వెనుకబడిన తరగ తుల సంక్షేమం కొరకు ఏ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదన్నారు. సిఎం కెసిఆర్ అణగారిన వర్గాల కొరకు ఎన్నో సంక్షేమ పథ కాలు చేపట్టారన్నారు. వెనుకబడిన వర్గాల స్ఫూర్తి ప్రదాత అయిన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నగరంలోని ప్రధాన హుసేన్ సాగర్ లేదా సెక్రటేరియట్ దగ్గరలో పెట్టడానికి నిర్ణయించామన్నారు. జ్యోతిరావు పూలే భార్య సావిత్రి పూలే బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేశారని, వారిని స్మరించుకొని స్ఫూర్తి పొందడానికి విగ్రహాలు దోహదపడతా యన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులు హాజరయ్యారు.

Statue of Mahatma Phule at Hyderabad Necklace Road
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News