Home సిద్దిపేట నగదు రహితం వైపు సిద్దిపేట అడుగులు

నగదు రహితం వైపు సిద్దిపేట అడుగులు

నగదు రహిత లావాదేవీలకు వడివడిగా అడుగులు
పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు
రికార్డు దిశగా సిద్దిపేట నియోజకవర్గం
ప్రభుత్వ శాఖల్లో స్వైపింగ్ మిషన్లు

CASHLESS-10

మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి: పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలకు సిద్ది పేట నియోజకవర్గం వడివడిగా అడుగులు వేస్తోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత చిల్లర సమ స్యల పరిష్కారానికి సిద్దిపేట నియోజకవర్గంలో నగదు రహిత లావాదేవీలను ప్రయోగాత్మ కంగా నిర్వహించాలనే సిఎం కెసిఆర్ నిర్ణయించడంతో ఆ దిశగా అడుగులు పడుతు న్నాయి. దాదాపు గత రెండు నెలల కాలంలో అవగాహన సదస్సులతో పాటు నగదు రహిత లావాదేవీల నిర్వహణపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజల్లో విస్తృత ప్రచారం జరిగింది.

దీంతో గత కొన్ని రోజులుగా సిద్దిపేట నియోజకవర్గంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సిద్దిపేట నియో జకవర్గంలో సిద్దిపేట మున్సిపాలిటీ, సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలు న్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు 2.50 లక్షల మేర జనాభాతో పాటు దాదాపు 70వేల కుటుంబాలున్నాయి. నియోజకవర్గం పరిధిలో 75 గ్రామ పంచాయతీల్లో 162 రేషన్ షాపులు, 142 గ్రామైఖ్య సంఘాలు, 25 పెట్రోలు బంకులున్నాయి. గ్రామైఖ్య సం ఘాల్లో దాదాపు 40 వేల మంది సభ్యులున్నారు.

వీరంతా నగదు రహితంగా లావాదేవీల నిర్వహణను ఇప్పటికే ప్రారంభించారు. నియోజకవర్గంలో దాదాపు ఐదు వేల స్వైపింగ్ మిషన్ల అవసరం వుండగా ఇప్పటి వరకు మూడు వేల వరకు పంపిణీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీల నిర్వహణకు అధికార యం త్రాంగం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలో 90 శాతానికి పైగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించడమే కాకుండా రూపీ కార్డులను అందజేశారు. వాణిజ్య సంస్థల్లో లావాదేవీలకు స్వైపింగ్ మిషన్లు, పేటీఎంలతో నిర్వహించేలా శిక్షణా కార్యక్రమా లను అందించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటిలో నగదు రహిత లావాదేవీల నిర్వ హణకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీ కొట్టు, కిరాణాషాపు, మటన్‌షాపు, వైన్స్, రేషన్ షాపులు మొదలుకుని పెట్రోలు బంకులు, ఆటోలు, ఆర్టీసీ బస్సులతో పాటు గ్రామైఖ్య సంఘాల్లో లావాదేవీల నిర్వహణ సైతం నగదు రహితంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రభు త్వ శాఖలైన మున్సిపల్, విద్యుత్, విద్య, వైద్య, రవాణా, పోలీస్‌శాఖల్లో పన్నులు, జరి మానాలు సైతం నగదు రహితంగా నిర్వహించడానికి స్వైపింగ్ మిషన్లు అందించారు. చిన్న చిన్న దుకాణాలు, తోపుడుబండ్లకు క్యూర్ పేటైమ్ పద్దతిల్లో చెల్లింపులు జరిగేలా చూస్తున్నారు. దీనిపై ఆయా వ్యాపార వర్గాలకు శిక్షణ ఇవ్వడంతో పలు చోట్ల ఇదే విధా నాన్ని అవలంబిస్తు ప్రజలు కొనుగోళ్లు జరుపుతుండటం విశేషం. ఇదే కాకుండా పలువురు బ్యాంకు ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను నిర్వహిస్తుండటం గమనార్హం.
పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు
అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో గత పక్షం రోజుల్లో డిజిటల్ చెల్లింపుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జనవరి మొదటి పక్షంలో నియోజకవర్గంలో దాదాపు 2.75 లక్షల లావాదేవీల్లో 56 కోట్ల విలువ గల చెల్లింపులు జరగడం గమనార్హం. పక్షం రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ లావాదేవీలు జరగడం దేశంలోనే దీన్ని రికార్డుగా చెప్పవచ్చు. సిద్దిపేట మునిసిపాల్టీ పరిధిలో 2742 లావాదేవీల్లో 75 లక్షల చెల్లింపులు జరిగాయి. దీనికి తోడు స్మార్ట్ ఫోన్ నుంచి ఆధార్ లింకుతో వేలిముద్ర ద్వారా నగదు మార్పిడి ఎయీపిఎస్(ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్స్) పంపిణీ మిషన్లను సైతం సిద్దిపేట పట్టణంలో పంపిణీ చేశారు. దీని ద్వారా మరింత సులభంగా నగదు రహిత చెల్లింపులు జరపడానికి అవకాశం ఏర్పడుతుంది.
గ్రామాల్లో ఉచితంగా వైఫై
డిజిటల్ చెల్లింపులను ప్రొత్సహించడంతో పాటు దానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడ కుండా వుండేందుకు ఉచిత వైఫై కనక్షన్లు గ్రామాల్లో ప్రారంభించారు. సిద్దిపేట మండలం లోని సగానికి పైగా గ్రామాలు నగదు రహిత లావాదేవీలను నిర్వహింస్తుండగా వారికి ఎలాంటి సాంకేతిక ఆటంకం కలగకుండా ఉచితంగా 20 ఎంబిపిఎస్ సామర్థం గల కనక్షన్లను అందిస్తున్నారు. దీని వల్ల గ్రామాల్లో రేషన్ షాపులతో పాటు ఇతర కొనుగోళ్ల సందర్భంలో ఇబ్బందులు ఏర్పడవు.
ఎప్పటికప్పుడు సమీక్షలు
నగదు రహిత లావాదేవీలను మరింత పెరిగేటట్టు చేయడానికి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు ఎంతో ప్రతిష్టా త్మకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఇం దు కోసం ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవడమే కాకుండా విలువైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే నగదు రహిత లావాదేవీల నిర్వహణ కోసం సిద్దిపేట ఆర్టీసీ డిపోలో 130 మిషన్లు ఇవ్వగా పోలీసు శాఖకు ఐదు, విద్యుత్, మున్సిపల్ శాఖల కు మిషన్లను అందజేశారు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు మిషన్లతోనే టికెట్లు జారీ చేస్తుండగా మునిసిపల్, విద్యుత్ శాఖల్లో నగదు రహితంగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఏది ఏమైనా అధికార యంత్రాంగం, మంత్రి హరీష్‌రావులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మరికొన్ని రోజుల్లో వంద శాతం నగదు రహిత లావాదేవీల నిర్వహణతో దేశంలోనే మొదటి నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటుందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కనిపించడం లేదు.