Saturday, April 20, 2024

మళ్లీ నంబర్‌వన్‌గా స్టీవ్ స్మిత్

- Advertisement -
- Advertisement -

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. మళ్లీ నంబర్‌వన్‌గా స్టీవ్ స్మిత్

Steve Smith Overtakes No 1 in ICC Test Rankings

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ తిరిగి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో స్మిత్ 891 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను స్మిత్ రెండో ర్యాంక్‌కు నెట్టేశాడు. విలియమ్సన్ 886 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడి పోయాడు. ఇక ఆస్ట్రేలియాకే చెందిన మరో స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు.

మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని నాలుగో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. విరాట్ 814 రేటింగ్ పాయింట్లతో నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు సంయుక్తంగా ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ పాట్ కమ్సిన్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక భారత స్టార్ స్పిన్నర్ 850 పాయింట్లతో రెండో, కివీస్ స్పీడ్‌స్టర్ టిమ్ సౌథి 830 పాయింట్లతో మూడో ర్యాంక్‌ను కాపాడుకున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత ఆటగాళ్లు అశ్విన్ రెండో, జడేజా నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

Steve Smith Overtakes No 1 in ICC Test Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News