Thursday, April 25, 2024

స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ హెచ్చుతగ్గుల(వొలాటిలిటీ) మధ్య చివరికి నష్టాల్లోనే ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170.89 పాయింట్లు లేక 0.28 శాతం పతనమై 61624.15 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 20.50 పాయింట్లు లేక 0.11 శాతం పతనమై 18329.20 వద్ద ముగిసింది. దాదాపు 1662 షేర్లు లాభపడగా, 1851 షేర్లు నష్టపోయాయి, 141 షేర్లు ఎలాంటి లాభనష్టాలు లేకుండా యథాస్థితిలో ముగిశాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్ర బ్యాంక్ ప్రధానంగా లాభపడగా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఐటిసి, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్, ఎస్‌బిఐ నష్టపోయాయి. రంగాలవారీగా చూసినప్పుడు రియాల్టీ, మెటల్ సూచీలు 1 శాతం చొప్పున లాభపడ్డాయి, కాగా ఎఫ్‌ఎంసిజి సూచీ 1 శాతం పతనమైంది. ఇక బిఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 44 పైసలు తగ్గి 81.25 వద్ద ముగిసింది. ఇది శుక్రవారం 80.81గా ఉండింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News