Tuesday, April 23, 2024

హెచ్చుతగ్గులు ఉంటాయ్

- Advertisement -
- Advertisement -

Stock Markets may face volatility

ఆప్షన్స్ గడువు, ఇతర అంశాల ప్రభావం, ఈ వారం మార్కెట్‌పై నిపుణులు

ముంబై : గత వారాంతం శుక్రవారం ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలోనూ దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఐదో వారం సానుకూలంగా ముగిశాయి. మార్కెట్లు 0.34 శాతం మేరకు పెరిగాయి. అయితే ఈ వారం మార్కెట్లు ఎలా ఉండనున్నాయనే సందేహాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాలు ముగిశాయి. ఇక ఈ వారం ముఖ్యంగా డెరివేటివ్స్ గడువు ఉంది. దీంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల ప్రవాహం, డాలర్ ఇండెక్స్ కదలికలు, క్రూడ్ ఆయిల్ వంటివి మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వారం డెరివేటివ్స్ గడువు తేదీ ఉండడం వల్ల మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూస్తాయని చెబుతున్నారు.

రెలిగేర్ బ్రోకింగ్ ప్రతినిధి అజిత్ మిశ్రా మాట్లాడుతూ, వరుసగా ఐదు వారాలుగా పెరిగిన మార్కెట్లు ఆరోగ్యకరంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో అమెరికా సూచీలపై ఆధారపడనున్నాయని, మార్కెట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. గత శుక్రవారం లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ 651 పాయింట్లు నష్టపోయి 59,646 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 198 పాయింట్లు కోల్పోయి 17,758 పాయింట్ల వద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ (ఎంక్యాప్) రూ.280.52 లక్షల కోట్లతో జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బిఎస్‌ఇ కంపెనీల మొత్తం విలువ రూ.2,80,52,760.91 కోట్లకు చేరుకుంది. అయితే శుక్రవారం మళ్లీ రూ.280 లక్షల కోట్ల స్థాయి నుంచి దిగువకు పడిపోయింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ కొనుగోళ్లు జరుపుతూనే ఉన్నారు. శుక్రవారం ఎఫ్‌ఐఐ (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) దాదాపు రూ.1,110 కోట్ల కొనుగోళ్లు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News