Friday, December 2, 2022

దళిత ప్రముఖుని భార్యగా స్త్రీ వేదనాగ్నులు

- Advertisement -

Biography Book

భీమన్న పల్లకీకి బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు  – బి. విజయభారతి వాస్తవ సామాజిక చిత్రణ 

పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి పదవులు సొంతం జేసుకోవడమే గాకుండా దళితుల నుంచి విసృ్తతంగా రచనలు చేసింది బోయి భీమన్న. ఆయన రచనలు ఆంగ్లం ఇతర భాషల్లోకి కూడా తర్జుమా అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన సమగ్ర సాహిత్యాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. తెలుగు నాట ఇంత మంచి పేరు, గుర్తింపు, గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఐదు పదులు దాటిన వయసులో, పెళ్లి చేసుకున్న భార్యను ఒంటరిగా వదిలేయడం నైతికతకు సంబంధించిన అంశం. కవిగా ఎంత గొప్పవాడయినా భార్య, పిల్లల బాగోగులను పట్టించుకోకుండా స్వీయ సౌఖ్యం వెతుక్కున్న భీమన్న జీవితంలోని మరో కోణాన్ని ‘బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు’ బహిర్గతం చేశాయి.

దళితుల నుంచి ఉన్నత స్థాయిలోకి ఎదిగొచ్చిన పురుషులను అగ్రకులాల స్త్రీలు ఎట్లా లొంగ దీసుకుంటారో హెచ్చరిస్తూ తమ జాతిని జాగృత పరిచే పుస్తకమిది. ఇంకా ఈ పుస్తకంలో చాలా మందికి తెలియని రహస్య జీవితాలు నిక్షిప్తమయ్యాయి. వీటన్నింటిని ఇలా పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిన బోయి విజయభారతి, ఆమె తమ్ముళ్లకు, చెల్లెకు అభినందనలు……. బయట కవులుగా, ప్రఖ్యాతులుగాపేరున్న వారు తమ పరపతిని ఉపయోగించుకొని ఎట్లాంటి చెడు తిరుగుళ్ళు తిరుగుతారో, అందులో పురుషులు దళితులై, వారి సాంగత్యంలోని స్త్రీలు బ్రాహ్మణులు అయితే దళిత స్త్రీలకు ఎట్లాంటి బాధలు ఎదురవుతాయో ఆమె చెప్పిండ్రు.

1959, 60 ప్రాంతాలలో ఆయన పరిచయాలు అమ్మాయిలకు సంబంధించి విశృంఖలంగా పరిణమించాయి. ఆయన రాసిన పాటలు ఇష్టంగా పాడే అమ్మాయిలను గురించి ఆయన రాసుకున్నవన్నీ చదివి అమ్మ గొడవ పెట్టుకునేది. ఆయన ఏ మాత్రం తగ్గకుండా తాను అలాగే ఉంటాననేవారు. “రాయవేశ్యా భుజంగ”వంటి లక్షణాలను పొగడ్తలుగా భ్రమించిన సమాజం ఇది.” అన్నారు. (పేజీ. 39)

“ఈలోగా నాన్నకు కొందరితో బంధం బలపడింది. అక్కడా పోటీ ఉండేది. పంతాలు పట్టింపులు అసూయాలు అలగడాలూ అన్నీ జరుగుతూనే ఉండేవి. ఒక విలాస పురుషునిగా తయారయ్యాడని అనేవారు. కాని పురుష ప్రపంచం అందుకు వత్తాసు పలికింది. లోకంలో కవులకు రచయితలకు కొంత ఆదరణ ఉంది మినహాయింపులూ ఉన్నాయి. వయసును బట్టి కొన్ని ఆకర్షణలు వ్యామోహాలకు దారితీయటం వాటివల్ల ఆ నాయకుల కవుల రచయితల కుటుంబ సంబంధాలు దెబ్బతినక పోవటమూ వంటి విషయాలు నాన్నే స్వయంగా అమ్మతో చెబుతూ ఉండేవారు. వారి లాగానే. తన తిరుగుళ్ళను అమ్మ ఆమోదించి పడి ఉండాలనేది ఆయన అంతరార్థం” అంటూ నాన్న భీమన్న గురించి బోయి విజయభారతి విశ్లేషించారు. (పేజి. 40). ఈ పుస్తకంలో ఇట్లాంటి వివరాలు ఎదిగిన పిల్లలపై దాని ప్రభావం, చివరికి కోర్టు కేసులు, ఆస్తి పాస్తుల వ్యవహారం అన్నీ ఈ ‘జ్ఞాపకాలు’లో నిక్షిప్తమయ్యాయి.

తెలుగు సాహిత్యంలో స్త్రీల జీవిత చరిత్రలు, ఆత్మకథలు చాలా తక్కువగా వెలువడ్డాయి. ‘అంతం నుంచి అనంతం వరకు’, సంగె లక్ష్మీబాయమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరరావు భార్య శ్రీరంగమ్మ, కొండపల్లి కోటేశ్వరమ్మ, నంబూరి పరిపూర్ణ, ముదిగంటి సుజాతా రెడ్డి, బండ సరోజన తదితరులు తమ ఆత్మకథలు వెలువరించారు. కొంత మినహాయింపుతో ఇదే కోవలో వచ్చిన ఆత్మకథ ‘బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు’. ఇందులో బోయి నాగరత్నమ్మ రాసుకున్న జ్ఞాపకాలకు తోడుగా ఆమె సంతానం కొన్ని ఖాళీలను పూరిస్తూ ‘అమ్మ’కు సంబంధించిన సమగ్ర చిత్రాన్ని అందించారు. నాగరత్నమ్మ కూతురు, తెలుగు అకాడెమీ మాజీ డైరెక్టర్, రచయిత్రి బోయి విజయభారతి స్త్రీ దృక్కోణంలో తన తల్లి వేదనను, అనుభవించిన కష్టాలను, ఆసరా అవసరమైన సమయంలో అనాదరణకు గురైన జీవితాన్ని గురించి ఆర్ద్రంగా సూటిగా చెప్పిండ్రు.

గొల్ల చంద్రయ్య కూతురుగానో, బోయి భీమన్న భార్య గానో, బోయి విజయభారతి తల్లిగానో, బొజ్జా తారకం అత్తగానో గాకుండా బోయి నాగరత్నమ్మగానే బతికింది. ఆపత్సమయాల్లో ఆదుకోవాల్సిన వాళ్ళే ‘పిశాచాలు’ అని దూరం బెట్టినప్పటికీ ఎక్కడా లొంగిపోకుండా, ధైర్యంగా, కాంప్రమైజ్ కాకుండా, ఆత్మగౌరవంగా బతికిన మనిషి బోయి నాగరత్నమ్మ. స్త్రీ తన కాళ్ళమీద తాను నిలబడాలంటే కచ్చితంగా విద్య అవసరమని జీవితారంభంలోనే తెలుసుకున్న మనిషి. తెలుసుకున్న విషయాల్ని ఆచరణలోకి తీసుకొచ్చిన కార్యశీలి నాగరత్నమ్మ. ఆమె దళితుల్లో తొలి తరం విద్యావంతురాలు. ఇంగ్లీషు అర్థం చేసుకోవడమే గాక, భారత, భాగవతాలలోని చాల పద్యాలు ఆమెకు కంఠస్థం. వ్రత మహాత్మ్యాల పుస్తకాలు, అష్టోత్తరాలు, భగవద్గీత తదితర పుస్తకాలు ఆమెకు నిత్య పారాయణాలు. అట్లాంటి ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించే పనికి పిల్లలు కృషి చేసిండ్రు. ఆ కృషి ఫలితమే ఈ పుస్తకం. నిజానికి తూర్పు గోదావరి జిల్లా దళిత మహిళా చైతన్యంలో బోయి నాగరత్నమ్మ కృషి మరువ రానిది.

తండ్రి గొల్ల చంద్రయ్య (18881971) ఆ ప్రాంతంలో చదువుకొని ఉపాధ్యాయుడిగా నియమితులైన తొలితరం దళితుల్లో ముందు వరుసలో ఉన్నాడు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే తనలాంటి ఆపన్నులకు ఆసరా అవ్వడానికి హాస్టల్‌ని ఏర్పాటు చేసి నిర్వహించాడు. హాస్టల్‌తో పాటుగా స్కూల్‌నీ స్థాపించాడు. ఇట్లా ఈ హాస్టల్ ఉంటూ స్కూల్‌లో చదువుకొని ఒక తరానికి తరం దళిత విద్యావంతులు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఆయన భూమి లేని మాల మాదిగలకు లంకలో భూములు ఇప్పించిండు. వ్యవసాయ పనులకూ, వృత్తి పనులకూ అప్పులు ఇవ్వటం, విద్యార్థులకు సహాయపడటం ఆయన కార్యక్రమాలు.

అప్పట్లో గొల్లపల్లి సామ్యేలు అనే అతను లేబర్ ఇన్‌స్పెక్టర్‌గా రాజోలులో ఉండేవాడు. ఆయనకు చెప్పి ప్రతిభావంతులైన దళితుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు వచ్చేలా కృషి చేసిండు.మొత్తం జిల్లానే గాకుండా ఆంధ్రాప్రాంతంలో దళితుల అభ్యున్నతికి గొల్ల చంద్రయ్య కృషి చేసిండు. 1917లో విజయవాడలో జరిగిన ప్రథమ ఆదిఆంధ్ర మహాసభ నిర్వహణలో ఆయన భాగస్వామి. ఈయన ఆరుగురి సంతానంలో నాగరత్నమ్మ ఒకరు. ఈమె జ్ఞాపకాలు ఇప్పుడు ఈ పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఇందులో నాగరత్నమ్మ జ్ఞాపకాలకు ఆమె నలుగురు సంతానం బోయి విజయభారతి, దత్తాత్రేయ శర్మ, నాగవర్మ, విజయలక్ష్మిలు కొన్ని విషయాలు జోడించారు. ఈ పుస్తకం ‘బోయి నాగరత్నమ్మ’ శతజయంతి నివాళిగా వెలువడింది.

ఈ పుస్తకంలో చాలా చేదు నిజాలు రికార్డయ్యాయి. కొందరికి ఇబ్బందిగా ఉంటుందని తెలిసినప్పటకీ వాస్తవాలు, అవీ తమ మాతృమూర్తికి సంబంధించినవి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ‘జనపద విజ్ఞాన కేంద్రం’ వారు ఈ జ్ఞాపకాలను ప్రచురించారు. బోయి నాగరత్నమ్మ పేరులోనే బోయి ఉన్నది. నిజానికి ఆ పేరుకు న్యాయం చేసినట్లుగా భీమన్నను పల్లకిలో పెట్టి ఆమె బోయిగా మోసింది అంటే అతిశయోక్తి కాదు. గొల్ల చంద్రయ్య కూతురుగా సంపన్న, విద్యావంతులైన కుటుంబంలో పుట్టిన నాగరత్నమ్మ పెళ్లి 17 ఏళ్ళ వయసులో అంటే 1936లో 25 ఏండ్ల వయసున్న బోయి భీమన్నతో జరిగింది. ఈ వివాహం బ్రహ్మసమాజ పద్ధతిలో జరిగింది. వీరి పెళ్ళిని మాజీ పార్లమెంటు సభ్యులు బయ్యా సూర్యనారాయణ మూర్తి, మాజీ మంత్రి వేముల కూర్మయ్యలు దగ్గరుండి జరిపించారు. పెళ్ళి తర్వాత కొన్ని రోజులు భీమన్న ముమ్మిడివరంలో టీచర్‌గా ఉద్యోగం చేసిండు. కలెక్టరు అయితడు అనుకొన్న కొడుకు టీచర్‌గా ఉద్యోగంలో చేరడంతో భీమన్న తండ్రి మల్లయ్య బాధపడ్డడు.

1935లో కాకినాడ పిఆర్ కాలేజి నుంచి ఆ ప్రాంతంలోని దళితుల్లో రెండోవాడిగా భీమన్న బిఎ పాసయిండు. అంతకు ముందు బయ్యా సూర్యనారాయణ మూర్తి దళితుల్లో బిఎ పాసయిన మొదటి వ్యక్తి. బిఎ తర్వాత భీమన్న మద్రాసు నుంచి తాపీధర్మారావు నడిపించిన జనవాణి పత్రికలో, కుసుమ ధర్మన్న రాజమండ్రి నుంచి నడిపించిన జయభేరి పత్రికల్లో వరుసగా 1936, 37 సంవత్సరాల్లో పనిచేసిండు. ఆ తర్వాత వివిధ రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయిండు. తర్వాత 1950లో ఆంధ్రప్రభ పత్రికలో చేరిండు. అంతకుముందు నుంచే ఆయన సాహిత్య వ్యాసాంగం కొనసాగింది. భీమన్న రాసే పుస్తకాల కోసం సమాచార సేకరణకు నాగరత్నమ్మ గ్రంథాలయాలకు వెళ్ళేది. భీమన్న చెప్పిన ప్రకారంగా నోట్సు రాసి పెట్టేది. అయితే కవిగా భీమన్నకు పేరు ప్రఖ్యాతులు వస్తున్న కొద్దీ ఆయన నాగరత్నమ్మకు దూరమయిండు.

ఈ విషయాలను గురించి ఇందులో విజయభారతి ఇలా రాసారు. “నాన్నకు తన మనస్సులోని భావాలు అనుభవాలు ఎలాంటివైనా సరే రాసి పెట్టుకునే అలవాటు ఉంది. ఇదివరకైతే ఆ అనుభవాలనూ భావాలను అమ్మ ఆస్వాదించేది. కవిగా ఆయన భావాలు అలాంటివి అనుకుని సమాధాన పడేది. కాని 1959, 60 ప్రాంతాలలో ఆయన పరిచయాలు అమ్మాయిలకు సంబంధించి విశృంఖలంగా పరిణమించాయి. ఆయన రాసిన పాటలు ఇష్టంగా పాడే అమ్మాయిలను గురించి ఆయన రాసుకున్నవన్నీ చదివి అమ్మ గొడవ పెట్టుకునేది. ఆయన ఏ మాత్రం తగ్గకుండా తాను అలాగే ఉంటాననేవారు. “రాయవేశ్యా భుజంగ”వంటి లక్షణాలను పొగడ్తలుగా భ్రమించిన సమాజం ఇది.” అన్నారు. (పేజి. 39)

“తన తిరుగుళ్ళను ఆమోదించి భార్యగా పడి ఉండాలని నాన్న ఆశించారు. ఎంతకూ దారికి రాకపోతే తన గదికి తాళం వేసుకుని వెళ్ళటం అలవాటు చేసుకున్నారు. నెల ఖర్చులకు డబ్బు ఇవ్వటం మానేశారు. స్త్రీలను తమ నియంత్రణలో ఉంచుకోవటానికి పురుషుల చేతిలోని ముఖ్యమైన ఆయుధం డబ్బు” (పేజి. 39) “అగ్రవర్ణపు అమ్మాయిలు మంచి యవ్వనంలో ఉన్నవారు తనపై కుతూహలం కనబరచటమే పురుషునికి కింది కులపు మగవానికి ఉత్తేజాన్నిస్తుంది. తన కవితలను వారు చక్కని స్వరంతో పాడగలిగిన వాళ్ళయితే ఇక ఆ కవులకు అంతకంటే స్వర్గం ఏమి ఉంటుంది. “ఏ స్త్రీ అయినా నాకు శృంగార మూర్తిగానే కనబడుతుంది” అని భీమన్న బాహాటంగానే చెప్పుకున్నారు. అది రసజ్ఞత అనుకున్నారు లోకులు” అంటూ అగ్రవర్ణపు అమ్మాయిల పట్ల ఆకర్షణను, బలహీనతలను విజయభారతి గారు రికార్డు చేసిండ్రు. అలాగే..“ఈలోగా నాన్నకు కొందరితో బంధం బలపడింది. అక్కడా పోటీ ఉండేది.

పంతాలు పట్టింపులు అసూయాలు అలగడాలూ అన్నీ జరుగుతూనే ఉండేవి. ఒక విలాస పురుషునిగా తయారయ్యాడని అనేవారు. కాని పురుష ప్రపంచం అందుకు వత్తాసు పలికింది. లోకంలో కవులకు రచయితలకు కొంత ఆదరణ ఉంది మినహాయింపులూ ఉన్నాయి. వయసును బట్టి కొన్ని ఆకర్షణలు వ్యామోహాలకు దారితీయటం వాటివల్ల ఆ నాయకుల కవుల రచయితల కుటుంబ సంబంధాలు దెబ్బతినక పోవటమూ వంటి విషయాలు నాన్నే స్వయంగా అమ్మతో చెబుతూ ఉండేవారు. వారి లాగానే. తన తిరుగుళ్ళను అమ్మ ఆమోదించి పడి ఉండాలనేది ఆయన అంతరార్థం” అంటూ నాన్న భీమన్న గురించి బోయి విజయభారతి విశ్లేషించారు. (పేజి. 40). ఈ పుస్తకంలో ఇట్లాంటి వివరాలు ఎదిగిన పిల్లలపై దాని ప్రభావం, చివరికి కోర్టు కేసులు, ఆస్తి పాస్తుల వ్యవహారం అన్నీ ఈ ‘జ్ఞాపకాలు’లో నిక్షిప్తమయ్యాయి.

సంసార జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా బోయి నాగరత్నమ్మ అధైర్య పడకుండా ఉన్నారు. అంతేగాదు తనతో పాటు కాలనీలో ఉండే వారికి శుభాశుభ సమయాల్లో అండగా నిలిచేవారు. తాను స్వయంగా కష్టాల్లో ఉన్నప్పటికీ తన లాగా మరెవ్వరూ కష్టాలు పడకూడదనే ఉద్దేశ్యంతో వారికి సహాయంగా నిలిచేది. స్వయంగా భర్తను కోల్పోయిన ఒక బంధువును దుర్గాబాయి దేశ్‌ముఖ్ కళాశాల నర్సింగ్ కోర్సులో చేర్పించి ఆమెకు ఉద్యోగ భద్రత కల్పించింది. ఇందుకోసం తనకున్న పరపతిని వినియోగించింది. అలాగే బొజ్జా తారకం ఇంట్లో పూజ చేసుకునేందుకు దేవుళ్ళ ఫోటోలు లేక పోయినా మనసులో జపం చేసుకుంటాను అని సర్దుకుపోయిండ్రు.

అంటే మతం, పూజ విషయంలో అంత నిక్కచ్చిగా లేదు అని చెప్పడమే ఉద్దేశం. ఈ పుస్తకంలో బోయి నాగరత్నమ్మ తీర్థయాత్రలు, బంధువులు, బలగం వారి వ్యవహారశైలి, ఒకప్పుడు గొల్ల చంద్రయ్య దగ్గర చదువుకున్న వారు హైదరాబాద్‌లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ ఉద్యోగాల్లో ఎట్లా నిలదొక్కుకున్నదీ రాసిండ్రు. రాజోలు, మద్రాసు, హైదరాబాద్ ఇట్లా వివిధ ప్రాంతాల్లో జీవించిన ఆమె అనుభవాలు ముఖ్యంగా ఒక దళిత స్త్రీగా ఆమె ఎదుర్కొన్న అవరోధాలు, వాటిని అధిగమించిన తీరుని రికార్డు చేసిండ్రు. బయట కవులుగా, ప్రఖ్యాతులుగా పేరున్న వారు తమ పరపతిని ఉపయోగించుకొని ఎట్లాంటి చెడు తిరుగుళ్ళు తిరుగుతారో, అందులో పురుషులు దళితులై, వారి సాంగత్యంలోని స్త్రీలు బ్రాహ్మణులు అయితే దళిత స్త్రీలకు ఎట్లాంటి బాధలు ఎదురవుతాయో ఆమె చెప్పిండ్రు.

పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి పదవులు సొంతం జేసుకోవడమే గాకుండా దళితుల నుంచి విసృ్తతంగా రచనలు చేసింది బోయి భీమన్న. ఆయన రచనలు ఆంగ్లం ఇతర భాషల్లోకి కూడా తర్జుమా అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన సమగ్ర సాహిత్యాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. తెలుగు నాట ఇంత మంచి పేరు, గుర్తింపు, గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఐదు పదులు దాటిన వయసులో పెళ్లి చేసుకున్న భార్యను ఒంటరిగా వదిలేయడం నైతికతకు సంబంధించిన అంశం. కవిగా ఎంత గొప్పవాడయినా భార్య, పిల్లల బాగోగులను పట్టించుకోకుండా స్వీయ సౌఖ్యం వెతుక్కున్న భీమన్న జీవితంలోని మరో కోణాన్ని ‘బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు’ బహిర్గతం చేశాయి. దళితుల నుంచి ఉన్నత స్థాయిలోకి ఎదిగొచ్చిన పురుషులను అగ్రకులాల స్త్రీలు ఎట్లా లొంగ దీసుకుంటారో హెచ్చరిస్తూ తమ జాతిని జాగృత పరిచే పుస్తకమిది. ఇంకా ఈ పుస్తకంలో చాలా మందికి తెలియని రహస్య జీవితాలు నిక్షిప్తమయ్యాయి. వీటన్నింటిని ఇలా పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిన బోయి విజయభారతి, ఆమె తమ్ముళ్లకు, చెల్లెకు అభినందనలు.

Story about Boi Nagarathnamma Biography Book

Related Articles

- Advertisement -

Latest Articles