Home తాజా వార్తలు స్వానురాగం అవసరమే!

స్వానురాగం అవసరమే!

Housewife

 

వేపాకులను మజ్జిగలో మెత్తగా రుబ్బి ఆ పేస్టును కాలిన గాయాలపై రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
శరీరంపై కాలిన చోట పాలమీగడ రాస్తే బాధ తగ్గటమే కాదు, శరీరం రంగు కూడా మారుతుంది.
ఒక కప్పు నీళ్ళలో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాల పొడి వేసి బాగా మరగించి అందులో రవ్వంత తేనె లేదా పంచదార కలిపి వేడిగా తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.

చాలా సమయం… ఇంకా మాట్లాడితే పూర్తి సమయం కుటుంబ అవసరాల కోసం కేటాయించే గృహిణులు తమ గురించి తాము ఎప్పుడూ తీరుబడిగా ఆలోచించుకోరని అంటున్నారు మానసిక నిపుణులు. ఎదుటి వాళ్లను ప్రేమించటం కోసం తమ గురించి తాము మరచి పోతారంటారు. కానీ ఎవరిని వాళ్లు ప్రేమించుకోకపోతే ఇతరులను ఇష్టపడటం అసాధ్యం అంటారు. స్వీయప్రేమ అంటే మనిషి తనను తాను గమనించుకొని, తనలోని మంచితనానికి ఆనందించి, తప్పులను క్షమించుకుంటూ, పొరపాట్లను సరిచేసుకుంటూ, తనపై తాను ప్రేమగా వ్యవహరించటం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ విలువను గుర్తించుకోండి. మీ జీవితానికి, ఆనందానికీ మీరే ముఖ్యమని గుర్తించండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఆ అనుభవం మీకు మరింత ప్రేమించే శక్తిని ఇస్తుందంటారు నిపుణులు.

ఒక పరిశోధన ప్రకారం.. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో మనలో ఉండే అనుమానాలు, ఒంటరి తనం, ఒత్తిడి అన్నీ నెమ్మదిగా మాయం అవుతాయి. అప్పుడు మన అనుభూతుల్ని, నిర్ణయాలను నమ్ముతాం. ధైర్యంగా ఉంటాం. హృదయపూర్వకంగా జీవించటం మొదలుపెడతాం. మనపైన మనమే ఏర్పరుచుకున్న సొంత అవరోధాల్ని అధిగమించి విశాల దృక్పథంలో కలలుకనటం మొదలుపెడతాం. ఈ పద్ధతి అలవాటు అయ్యాక ప్రతికూలమైన అంశాలపైన ప్రతి నిమిషం దృష్టి నిలపటం మానేస్తాం. వర్తమానంలో జరుగుతున్న విషయాలను, అందుకోగలిగే అవకాశాలను మనసు గుర్తించగలుగుతుంది. ఎలాంటి ప్రేమనైన అందుకోగలిగే అర్హత ఉన్న మొదటి వ్యక్తి మనమేనని మనసు తెలుసుకుంటుంది. ఇక మనం కోరుకునే అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించుకోవటం కోసం, వెయ్యింతల శక్తితో పనిచేసే ఉత్సాహం వస్తుంది అంటారు మనో విశ్లేషకులు.

అనుభూతులు స్వీకరించాలి: జీవితంలో ఎన్నో అనుభవాలు క్షణ క్షణం ఎదురవుతూ ఉంటాయి. సంతోషం, కృతజ్ఞత, ఓటమి ఏదైన కావచ్చు ఒడిదుడుకుల మయంగా ఉండే జీవితంలో వీటన్నింటితో కలిసి నడవాలి. ఎన్నెన్నో అనుభవాలు ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బజారుకు వెళుతూ ఉంటే చిన్న ప్రమాదం జరుగుతుంది. ఆఫీసులో ఏదో సమస్య వస్తుంది. మనల్ని మనం ప్రేమించుకునే శక్తి మనలో ఉంటే ఈ రెండు అనుభవాలని ఒకటి ఎంతో ప్రమాదం తప్పిపోయిందని, ఆఫీసులో సమస్యలు ఎంతో సహజంగా వస్తూ ఉంటాయని, ఈ నిమిషంలో ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించేలా మనం ఆరోగ్యంగా ఉన్నామని మనసు గుర్తు చేస్తుంది.

అనుకున్నట్లుగా ఒకే రకంగా సంతోషంగా జీవితం ముందుకు సాగనందుకు విచారం అదే సమయంలో మనలో ఉండే శక్తియుక్తులు, ఇతర మంచి లక్షణాలు, మన ఆరోగ్యం ఇవన్నీ ఆ లోపాల్ని సమతౌల్యం చేసి చూపెడతాయి. అంటే మనల్ని ప్రేమించుకోగలిగితే, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ఆ సందర్భాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలమనే ధైర్యం అంతరంతరాలలో కలుగుతుంది. ఎప్పుడూ ఎదుటి మనుషులే సంతోషంగా ఉన్నారనో, వాళ్లు అదృష్టవంతులనో అన్న భావన మనసులోకి రానివ్వకుండా మనుషుల్లో ఉండే సద్గుణాలు, దుర్గుణాలు అనేవి మనలో కూడా ఉంటాయని, ఉన్నాయని తెలుసుకోగలుగుతాం. ప్రతి క్షణాన్ని వాస్తవంలో చూడటం అలవాటైపోతుంది.

నిజమే ప్రపంచంలో ప్రతి మనిషికీ ఏదో ఒక కష్టం వస్తుంది అలాగే మనకీ వస్తాయి. మనల్ని మనం ప్రేమించుకోలేకపోతే ప్రతి చిన్న కష్టం కొండంత ఎత్తున భయపెడుతుంది. మనపైన మనకి ఒక అంచనా, నమ్మకం లేక, ప్రతి కష్టాన్ని ఎంతో ఎక్కువగా ఊహించుకొని, హింసించుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోగలుతామో అప్పుడు ముందు మన విలువ కళ్లముందు నిలబడుతుంది. ఇలాంటి ఇబ్బంది ఎవరికి వచ్చినా, వాళ్లు మనలాగే నిబ్బరంగా నిలబడి ఆ ఇబ్బందిని ఎదుర్కొంటారనే గుర్తింపు మనసులోకి వస్తుంది.

స్వీయ ప్రేమ ఒక అభ్యాసం: ప్రేమ నిండిన ప్రపంచాన్ని సృష్టించడానికి సెల్ఫ్ లవ్ తొలిమెట్టు. దీనివల్ల మనలో ప్రేమించే శక్తి మరింత పెరుగుతుందే కానీ తరిగిపోదు. ఇద్దరి మధ్య ప్రేమ జన్మించాలంటే వాళ్లిద్దరిలో ప్రేమించే శక్తి ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోగలిగితే ఇతరులను ప్రేమించటం చేతనవుతుంది. ఈ సెల్ఫ్‌లవ్‌ని అభ్యాసంతో నేర్చుకోమంటున్నారు సైకాలజిస్టులు. అద్దం ముందు నిలబడి మన ప్రతిబింబాన్ని పుట్టుకతో వచ్చిన ప్రతి లక్షణాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. చక్కగా మాట్లాడటం, తీరుగా దుస్తులు ధరించటం, ఆత్మవిశ్వాసంతో నడవటం, ఎదుటి మనిషి కళ్లల్లోకి నేరుగా చూస్తూ ధైర్యంగా సంభాషించటం, ఎదుటివాళ్లవి, మనవీ ఇద్దరి తప్పులు మన్నించేలా మనసులో విశ్లేషించుకోవటం, ఇవన్నీ సాధనతో సాధించే పనులే.

మనల్ని మనం ప్రేమించుకుంటూ, ప్రోత్సహించు కుంటే, ఆ లక్షణాలు మనల్ని మరింత బాగా తీర్చిదిద్ది, ఎదుటివాళ్లను ఎంతో ప్రేమించే, క్షమించే శక్తి ఇస్తాయి. ప్రతివాళ్లు ఇతరుల పట్ల ఎన్నో అపరాధాలు, అపచారాలు చేస్తారు. పోన్లే దాన్ని ఇప్పటికి సరే అనేద్దాం అని మనసు చెప్పేస్తుంది. ఇక కొత్త ఉత్సాహం మనసులో పొంగి పొరలటం మొదలవుతుంది. మనం ఒక సంపూర్ణమైన మనిషిగా మార్చే మన మనసుకే అనిపిస్తూ ఉంటుంది.

Story about Housewife dictionary definition