Home తాజా వార్తలు సారూ.. పివి నరసింహారావు.. మళ్లీ రా…వు!

సారూ.. పివి నరసింహారావు.. మళ్లీ రా…వు!

Story about PV Narasimha Rao life story

 

పాములపర్తి వెంకట నరసింహారావు. పేరు రాయాలన్నా.. పలకలాలన్నా.. స్మరించుకున్నా.. అక్షరాలు,పదాలు,పెదాలు, తెలుగు హృదయాలు గర్వ కారకంగా నిలిచిన పేరు. 28 జూన్ 1921 ఇది మన పీవీ పుట్టిన తేది, మాసం, సంవత్సరం. ఆ రోజు తెలుగు నేల పై జన్మించిన శ్రీ పీవీ గారిని నేటికీ సమున్నత గౌరవంతో స్మరించుకోవడం లో ఉన్న అనుభూతి అనిర్వచీయమైనది. పివి ఆన్న రెండు అక్షరాలను పలికితే వెంటనే స్ఫురణకు వచ్చేలా తన పేరును యావత్ భారతం శాశ్వతం గా చరిత్ర పుటల్లో లిఖించిన ఘనత ప్రధాని పీవీ దే.ప్రధాని పదవికే వన్నె తెచ్చిన గొప్ప శక్తి, మన తెలుగు వ్యక్తి. తెలుగు తేజస్సు దేశ రాజధానిలో ఎర్ర కోట పై మువ్వన్నెల ను రెపరెప లాడించిందని, అది మన పీ వీ నే అని అప్పటినుంచి ఇప్పటికీ గుర్తుపెట్టుకుని గర్వంగా మురిసిపోయే అనుభూతి.

పీ వీ మావాడు అని తెలుగు నేల, నా వాడు అని తెలుగు భాష, మనోడే అని తెలంగాణా యాస, నా రక్తం అని పాములపర్తి వంశం మాత్రమే గాక ప్రతి తెలుగు హృదయం పీ వీ మన విజయం అని చాటుకునే లా తెలుగు ప్రజ్ఞ ను ప్రపంచానికే చాటి చెప్పిన ‘చాణక్యుడు‘. భారత చరిత్ర అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎన్నడూ మారవలేని మహా మనిషిగా తన మేధో సారాన్ని ఇండియా ‘ఐడియా‘ గా మలచిన మేడిన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు.అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆర్థిక సంస్కరణల స్వాప్నికునిగా భారత్ అంటే పీ వీ అని ప్రధాని పదవి ఠీవీ నీ ఇనుమూడింపజేసిన సాహసి పీ వీ నరసింహారావు.

ప్రైమ్ మినిస్టర్ ఆన్న సమున్నత గౌరవ పదవికే గౌరవం ఖ్యాతి నీ సమపార్జించి పెట్టిన అసమాన ప్రతిభా శాలి గా భారత రాజనీతి లో రాజ ముద్ర వేసుకున్నారు. దక్షిణ భారత ఆత్మగౌరవ ప్రతీక గా మారి ద్రవిడ భూమి, వందనం అభివందనం స్వీకరించే నామ ధేయుడయ్యారు. భారతావని ఆర్థిక పునాదుల బలోపేతానికి ఆద్యుడాయ్యారు.అనుసరణీయమైన ఆచరణా యోగ్యమైన బంగారు బాట వేశారు. ప్రధానిగా ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించిన భారతావనికి అనమానం లేకుండా అనవసర ఆలోచన అన్నదే లేకుండా ‘జస్ట్ పీ వీ ఈజ్ బెస్ట్‘ అని ప్రైమ్ మినిస్టర్ గా తన పేరు తప్ప ఇతరుల పేరు కనీసం ఆలోచించడానికి కూడా తావివ్వని వ్యక్తిత్వ శ్రేశ్టత తో నో ఆప్షన్ ఓన్లీ వన్ పర్సన్ గా ఎంపిక లో తన కు ఎవరూ ఐచ్చికం లేకుండా కాకుండా పర్ఫెక్ట్ సూటబుల్ మ్యాన్ గా ప్రధాని పదవి సాంతం తననే వెదుక్కుంటూ వచ్చేలా చేయగల్గిన రాజ నీతి కోవిదుడు మన పీ వీ యే అంటే ఔరా అనిపించక మానదు.

నేను చదివింది పీ వీ చదివిన బడిలోనే ,అని రాష్ట్రపతి పురస్కార గ్రహీత అణు భూ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ వెళ్ది రమేష్ బాబు సగర్వంగా చెప్పుకోవడం గమనిస్తే కనీసం ఆ మహనీయుడు నడయాడిన నేల గొప్పదనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పీ వీ తో అనుబంధం, పరిచయం , ఉన్న ప్రతీ ఒక్కరూ తలచుకుంటేనే తన్మయత్వానికి లోనయ్యే లా చేసిన ఘనతా పాములపర్తి దే అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మిత్రులు తయ్యాల శశికాంత్ పీ వీ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో అందునా భారత చరిత్ర లో పీ వీ ది ఒక శకం అన్నారు .

ఇది ‘ఇన్‌సైడర్‘ పివిలో ఒక కోణం కాగా
రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. అతను రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్‌సైడర్ అనే అతను ఆత్మకథ. లోపలిమనిషిగా ఇది తెలుగులోకి అనువాదమయింది. నరసింహారావు బహుభాషాకోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వచ్చు. కోబాల్, బేసిక్, యునిక్స్ ప్రోగ్రామింగ్ వంటి మెషీను భాషలలో కూడా ప్రవేశం ఉంది

పివి రచనలు…
సహస్రఫణ్ : విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం. ఈ పుస్తకానికై పీ వీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
అబల జీవితం : పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి తెలుగు అనువాదం.
ఇన్‌సైడర్ : పివి స్వయంగా రచించిన ఆత్మ కథాత్మక నవల. దీనిలోని ఘట్టాలకు పీవీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంతవరకూ అతను జీవితఘట్టాలకు చాలా చాలా పోలిక ఉంది. నవలలోని కథానాయక పాత్ర ఆనంద్ పీ వీ నరసింహారావేనని విమర్శకులు భావిస్తారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలు నిజపాత్రలు పెట్టి, రాష్ట్ర నాయకుల పాత్రలకు పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమయింది. తెలుగులోకి లోపలి మనిషిగా అనువాదం అయింది.

ప్రముఖ రచయిత్రి ‘జయ ప్రభ‘ కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో ‘గొల్ల రామవ్వ‘ కథ విజయ కలం పేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. 1995లో ‘విస్మృత కథ‘ సంకలనంలో ప్రచురించబడేప్పుడు కథారచయిత శ్రీపతి చొరవ, పరిశోధనలతో ఇది పి.వి.నరసింహారావు రచనగా నిర్ధారణ అయింది. ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో వ్రాసాడు. కాంగ్రెసువాది పేరుతో 1989లో మెయిన్‌స్ట్రీం పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది.